Jio Cheapest Plan : పండగ చేస్కోండి.. జియో చీపెస్ట్ ప్లాన్ అదుర్స్ .. సింగిల్ రీఛార్జ్‌తో 11 నెలలు ఫుల్ ఎంజాయ్..!
Jio Cheapest Plan : జియో చీపెస్ట్ ప్లాన్ అందిస్తోంది. సింగిల్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా 11 నెలల పాటు ఎంజాయ్ చేయొచ్చు. SMS బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

Jio Cheapest Plan : జియో యూజర్లకు అద్భుతమైన ఆఫర్.. జియో చీపెస్ట్ ప్లాన్ అందిస్తోంది. నెల కాదు.. ఏకంగా 11 నెలల పాటు ఎంజాయ్ చేయొచ్చు. ప్రస్తుతం జియో పోర్ట్‌ఫోలియోలో వివిధ రకాల రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి.

కంపెనీ సరసమైన ప్లాన్లు మాత్రమే కాదు.. హై రేంజ్ రీఛార్జ్ ప్లాన్లను కూడా అందిస్తుంది. మీరు జియో యూజర్ అయితే ఈ చీపెస్ట్ ప్లాన్ అసలు మిస్ చేయొద్దు. తక్కువ ధరకు లాంగ్ టైమ్ వ్యాలిడిటీతో రీఛార్జ్ ప్లాన్ కలిగి ఉంది. కాలింగ్ , SMS బెనిఫిట్స్ కూడా అందిస్తుంది.

రూ. 1748 ప్లాన్ విషయానికి వస్తే.. జియో వాల్యూ ప్లాన్‌లలో ఈ రీఛార్జ్ యాక్సెస్ పొందవచ్చు. ఈ ప్లాన్ సుమారు 11 నెలల వ్యాలిడిటీని అందిస్తుంది. జియో రూ. 1748 ప్లాన్ యూజర్లకు 336 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది.

వినియోగదారులకు మొత్తం వ్యాలిడిటీతో పాటు 3600 SMS మెసేజ్ కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌తో కంపెనీ అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తుంది.

ఈ ప్లాన్‌లో జియోటీవీ, జియోఏఐక్లౌడ్‌లకు యాక్సెస్ ఉంటుంది. ఈ ప్లాన్ డేటా బెనిఫిట్స్ పొందలేరు. కంపెనీ అందించే వాయిస్-ఓన్లీ ప్లాన్ ద్వారా డేటా పొందాలంటే మీరు సపరేటుగా రీఛార్జ్ చేసుకోవాలి.

మీరు కాలింగ్-ఓన్లీ ప్లాన్ కోరుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్. సిమ్‌ను యాక్టివ్ లేదా కాలింగ్-ఓన్లీ ప్లాన్ కోరుకునే వారికి ఈ ప్లాన్ బెటర్. మీరు డేటా-ఓన్లీ ప్లాన్ తీసుకుంటే ఇతర ఆప్షన్లను ఎంచుకోండి. తద్వారా అదనంగా డేటా పొందవచ్చు.

చౌకైన డేటా ప్లాన్ ధర రూ. 189. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది . 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. కంపెనీ రూ. 448కు కాలింగ్-ఓన్లీ ప్లాన్ ద్వారా 84 రోజులు వ్యాలిడిటీని అందిస్తుంది.
