PM Kisan Budget 2026 : పీఎం కిసాన్ 22వ విడతపై బిగ్ అప్డేట్.. ఫిబ్రవరి 1 బడ్జెట్ రోజునే రైతుల ఖాతాల్లోకి రూ. 2వేలు? ఫుల్ డిటెయిల్స్
PM Kisan Budget 2026 : ఫిబ్రవరి 1నే కేంద్ర బడ్జెట్.. ఈసారి పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల పెంపుపై వ్యవసాయ రంగం భారగా ఆశలు పెట్టుకుంది. ఈ బడ్జెట్ రోజునే పీఎం కిసాన్ 22వ విడత రూ. 2వేలు విడుదల చేస్తుందా?
PM Kisan Budget 2026 ( Image Crdit : AI )
- ఫిబ్రవరి 1నే కేంద్ర వార్షిక బడ్జెట్, రైతుల్లో భారీగా ఆశలు
- పీఎం కిసాన్ యోజన ఫండ్ మొత్తాన్ని పెంచుతారనే అంచనాలు
- బడ్జెట్లో ఈ పథకానికి మరిన్ని కేటాయింపులు ఉండొచ్చు
- 22వ విడతకు ముందు రైతులకు బిగ్ రిలీఫ్ ఉండొచ్చు
PM Kisan Budget 2026 : బడ్జెట్‌కు సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 1నే కేంద్ర వార్షిక బడ్జెట్.. ప్రతి రంగం నుంచి బడ్జెట్‌పై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ప్రతి పౌరుడు, ప్రతి రంగం ఈ బడ్జెట్లో ప్రభుత్వం నుంచి ఏదో ఒకటి డిమాండ్ వినిపిస్తూనే ఉంది.
వ్యవసాయ రంగానికి కూడా అనేక డిమాండ్లు ఉన్నాయి. ప్రధాన డిమాండ్లలో ఒకటి.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధుల పెంపు అంశం. గత కొన్ని నెలలుగా పీఎం కిసాన్ యోజన మొత్తాన్ని పెంచేందుకు అనేక చర్చలు జరుగుతున్నాయి. రైతు కమిటీలు సైతం ఈ అంశంపై ప్రభుత్వం దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లాయి.
పీఎం కిసాన్ యోజన ద్వారా లబ్ది పొందుతున్న రైతులకు ప్రభుత్వం ప్రతి ఏడాది రూ. 6వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని 3 విడతలుగా పంపిణీ చేస్తారు. ఇప్పటివరకు, ఈ పథకం 21 విడతలు విడుదల అయ్యాయి. ప్రతి విడత రూ. 2వేలు అందుకుంటారు. రైతులు 22వ విడత కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే, బడ్జెట్ రోజున రైతులకు భారీ ఉపశమనం లభిస్తుందా? లేదా నిరాశ ఎదురవుతుందా? అనేది పరిశీలిద్దాం..
పీఎం కిసాన్ యోజన రూ. 63,500 కోట్లు కేటాయింపు :
2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన కోసం రూ. 63,500 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్లో కూడా రూ. 63,500 కోట్లు కేటాయించింది. అందుకే ప్రభుత్వం ఈ పథకానికి మరిన్ని బడ్జెట్లను కేటాయించవచ్చునని రైతులు ఆశిస్తున్నారు.
ఈసారి కేటాయింపులో పీఎం కిసాన్ యోజన వాయిదా పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్లో వ్యవసాయం, సంబంధిత రంగాలకు FY25లో రూ. 1.52 లక్షల కోట్లు, FY26లో రూ. 1.37 లక్షల కోట్లు కేటాయించింది. అయితే, ఎంఎస్పీ, ఇన్పుట్ సబ్సిడీలపై ఖర్చుతో సహా ఈ రంగంపై వ్యయం రూ. 3.91 లక్షల కోట్ల కన్నా ఎక్కువగా ఉంది.
22వ విడతకు ముందు 22 విడత వస్తుందా? :
ఫిబ్రవరి 1, 2026న సమర్పించనున్న బడ్జెట్లో వ్యవసాయం, సంబంధిత రంగాలకు కేటాయించిన బడ్జెట్‌ను పెంచితే 22వ విడత పీఎం కిసాన్ యోజనకు ముందు రైతులకు బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు.
పీఎం కిసాన్ యోజన 22వ విడత ఎప్పుడంటే?
పీఎం కిసాన్ యోజన 22వ విడతకు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి సమాచారాన్ని ప్రకటించలేదు. ప్రస్తుతం, అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు బడ్జెట్ కోసం సన్నాహాలు చేస్తున్నాయి. అందుకే, ఫిబ్రవరి 1, 2026న బడ్జెట్ సమర్పించిన తర్వాతే పీఎం కిసాన్ యోజన 22వ విడత విడుదల అయ్యే అవకాశం ఉంది.
ఈసారి రూ. 2 వేలు లేదా రూ. 4 వేలు వస్తాయా? :
పీఎం కిసాన్ యోజన 22వ విడతలో సాంకేతిక సమస్యల కారణంగా గత వాయిదాలు ఆలస్యంగా విడుదల అయ్యాయి. ఈసారి రైతులకు ఒక్కొక్కరికి రూ. 4వేలు అందవచ్చు. అయితే, పథకం బడ్జెట్ పెంచితే వచ్చే ఆర్థిక ఏడాది నుంచి పీఎం కిసాన్ వాయిదా డబ్బులు పెరగవచ్చు.
