UPI Payment Rules : UPIతో చెల్లిస్తే ఇక ఎక్స్‌ట్రా ఛార్జీ? అక్టోబర్ 15 నుంచి రూల్స్‌పై 7 ప్రశ్నలకు సమాధానాలివే
UPI Payment Rules : అక్టోబర్ 15 నుంచి కొన్ని యూపీఐ మర్చంట్ లావాదేవీలపై 0.4శాతం ఎండీఆర్ వర్తించనుంది. ఈ ఛార్జీని కస్టమర్ల నుంచి దుకాణదారులు వసూలు చేయవచ్చా? రూ.2వేల లోపు పేమెంట్ల పరిస్థితి ఏంటి? 7 ప్రశ్నలకు సమాధానాలేంటో చూద్దాం..
- Sreehari A
- Published on- September 17, 2026 / 05:00 PM IST
UPI Payment Rules
- అక్టోబర్ 15 నుంచి యూపీఐపై కొత్త ఛార్జీ? మీ జేబుకు ఎంత భారం?
- రూ.5వేలు బిల్లుకు రూ.20 యూపీఐ ఛార్జీనా? దుకాణదారుడు వసూలు చేయొచ్చా?
- యూపీఐ పేమెంట్స్‌పై 0.4శాతం ఎండీఆర్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన 7 విషయాలివే
UPI Payment Rules : యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్.. యూపీఐతో షాపులో చెల్లిస్తే ఇకపై అదనంగా డబ్బులు కట్టాలా? అనే సందేహం చాలామందికి ఉంది. అక్టోబర్ 15 నుంచి రూ.2వేలకుపైబడిన మర్చంట్ లావాదేవీలపై 0.4శాతం ఎండీర్ వర్తించనుంది. అయితే, ఈ ఛార్జీ కస్టమర్‌పై పడదు.. మర్చంట్ వైపు మాత్రమే ఉంటుంది. రాబోయే యూపీఐ ఛార్జీల విషయంలో కస్టమర్లు తెలుసుకోవాల్సిన 7 ముఖ్యమైన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం..
1. దుకాణదారుడు యూపీఐ ఛార్జీ పేరుతో అదనంగా డబ్బులు అడగవచ్చా?
లేదు. యూపీఐ ఎండీఆర్ కస్టమర్‌పై వేయకూడదు. ఉదాహరణకు రూ.5వేలు బిల్లు ఉంటే యూపీఐ కోసం అదనంగా రూ.20 అడగకూడదు.
2. 0.4శాతం ఎండీఆర్ ఏంటి? :
అక్టోబర్ 15 నుంచి అర్హత ఉన్న రూ.2వేలకు పైబడిన P2M లావాదేవీలపై 0.4శాతం ఎండీఆర్ వర్తిస్తుంది. రూ.5వేలకు రూ.20 అవుతుంది. అయితే, ఈ మొత్తాన్ని కస్టమర్ చెల్లించాల్సిన అవసరం లేదు.
3. యూపీఐ ఇకపై సాధారణ యూజర్లకు ఖరీదైనదా?
లేదు. సాధారణ వ్యక్తిగత యూపీఐ పేమెంట్లపై కొత్త ట్రాన్సాక్షన్ ఫీజు ఉండదు.
4. రూ.2వేల లోపు చెల్లిస్తే? :
వ్యాపారులకు చేసే రూ.2వేల వరకు యూపీఐ పేమెంట్లపై ఈ ఎండీఆర్ వర్తించదు.
5. రూ.2,500 బిల్లు అయితే? :
0.4శాతం ప్రకారం ఎండీఆర్ రూ.10 అవుతుంది. కానీ, ఆ రూ.10ను కస్టమర్ బిల్లుకు యాడ్ చేయొద్దు
6. చిన్న కిరాణా షాపుల పరిస్థితి ఏంటి? :
అర్హత ఉన్న చిన్న వ్యాపారులకు జీరో ఎండీఆర్ విధానం కొనసాగుతుంది. రూ.2వేలు దాటిన ప్రతి పేమెంట్‌కు ఆటోమేటిక్‌గా ఎండీఆర్ వర్తిస్తుందని అనుకోవద్దు.
7. దుకాణదారుడు యూపీఐ ఛార్జీ అడిగితే? :
బిల్లు తీసుకుని, అదనపు మొత్తం ఎందుకు అడుగుతున్నారో తెలుసుకోండి. అది యూపీఐ, ఎండీఆర్ ఛార్జీ అని చెబితే బిల్లు, పేమెంట్ వివరాలను దగ్గరపెట్టుకోండి.
ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది. ఎండీఆర్ మార్పు ప్రధానంగా మర్చంట్ పేమెంట్ సిస్టమ్ మధ్య ఉంటుంది. సాధారణ యూపీఐ యూజర్ ప్రతి పేమెంట్‌కు అదనపు ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు.
