Plastic Currency Notes : కరెన్సీ నోట్లపై గాంధీ స్థానంలో మరో వ్యక్తి ఫొటో పెట్టొచ్చా? ప్లాస్టిక్ నోట్లపై అసలు రూల్ ఇదే!
Plastic Currency Notes : పేపర్ నోట్ల స్థానంలో ప్లాస్టిక్ నోట్లు రాబోతున్నాయా? ఈ కొత్త కరెన్సీ నోట్లపై గాంధీ ఫొటో మారబోతుందా? అసలు కరెన్సీ నోట్లపై ఫొటో మార్చాలంటే రూల్ ఏంటి? ఎవరికి అధికారం ఉంది? ఫుల్ స్టోరీ మీకోసం..
- Sreehari A
- Updated on- August 8, 2026 / 06:52 PM IST
Plastic Currency Notes
- ప్లాస్టిక్ కరెన్సీ వస్తే గాంధీ ఫొటో మార్చే అవకాశం ఉందా?
- కరెన్సీ నోట్లపై మరో వ్యక్తి ఫొటో పెడతారా? రూల్ ఏం చెబుతోంది?
- కరెన్సీ నోట్లపై ఫొటో మార్చే అధికారం ఎవరికుంది?
- గాంధీ ఫొటోను మార్చొచ్చా? కరెన్సీ నోట్లపై అసలు రూల్ ఇదే!
Plastic Currency Notes :పేపర్ కరెన్సీ నోట్లు మారబోతున్నాయా? ప్లాస్టిక్ నోట్లు నిజంగా రాబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నోట్లపైనే ఇదే చర్చ నడుస్తోంది. ఎక్కువ లైఫ్ ఉండే పాలీమర్ కరెన్సీ నోట్లను చలామణీలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
అయితే, పేపర్ కరెన్సీ స్థానంలో పాలిమర్ నోట్లు రానున్నాయనేది ఒక విషయం అయితే.. అదే నోటుపై మహాత్మా గాంధీ ఫొటో స్థానంలో మరో ప్రముఖుడి ఫొటో పెట్టడం కూడా ప్రదాన చర్చకు దారితీసింది. గాంధీ స్థానంలో కరెన్సీపై మరొకరి ఫొటోను ముద్రించడం ఇప్పుడు సాధ్యమేనా? అసలు దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆర్బీఐ ఒక్కటే నిర్ణయం తీసుకోగలదా? కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా తప్పనిసరిగా ఉండాలా? లేదా అనేదానిపై పూర్తి వివరణతో ఇప్పుడు తెలుసుకుందాం..
గాంధీ ఫొటో మార్చాలంటే ఏం చేయాలి? :
భారతీయ కరెన్సీ నోట్ల డిజైన్, లుక్, కరెన్సీ తయారీలో వాడే మెటీరియల్‌పై నిబంధనలు ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 25లో ఉన్నాయి. ఈ సెక్షన్ ప్రకారమే నోట్ల డిజైన్, లుక్, మెటీరియల్‌ను ఆర్బీఐ సెంట్రల్ బోర్డు చేసిన సిఫారసులను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. అంటే.. గాంధీ ఫొటోను తీసేసి మరో వ్యక్తి ఫొటోను పెట్టడం ఆర్బీఐ ఒక్కటే తీసుకునే నిర్ణయం కాదు.
అధికారిక ప్రక్రియకు రూల్ ఇదే :
కరెన్సీ నోటుపై మహాత్మా గాంధీ ఫొటో స్థానంలో మరో ప్రముఖుడి ఫొటోను ముద్రించాలంటే ఆర్బీఐ చట్టంలో 1934లోని సెక్షన్ 25 ప్రకారం ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. కరెన్సీ నోట్లలో ఎలాంటి మార్పులు చేయాలన్నా ముందుగా పార్లమెంటు లేదా ఆర్బీఐ అధికారికంగా ప్రకటన విడుదల చేయాలి. ఆ తర్వాతే కొత్త డిజైన్ సిరీస్ ప్రవేశపెట్టాలి.
Read Also : UPI Payments : ఫోన్‌పే యూజర్లకు కంపెనీ బంపర్ ఆఫర్.. ఇక లైఫ్ లాంగ్..
అందులో నోటు డిజైన్, లుక్, మెటీరియల్‌పై ఆర్బీఐ, సెంట్రల్ బోర్డు సిఫారసులు చేయాలి. ఆ సిఫారసులను పరిశీలించాకే కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంటుంది. ఇందులో ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ (DEA)లోని కాయిన్ అండ్ కరెన్సీ డివిజన్ కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ విభాగమే నోట్ల డిజైన్, లుక్, మెటీరియల్, సేఫ్టీ ఫీచర్లకు సంబంధించిన విధాన అంశాలను పరిశీలిస్తుంది.
అసలు ప్లాస్టిక్ నోట్లు ఎందుకంటే? :
ప్లాస్టిక్ నోట్ల మాట ఇప్పటిది కాదు.. గతంలోనే పాలిమర్ నోట్లపై భారత్‌లో అనేక ప్రయోగాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2012, 2013లో రూ. 10 నోట్లను పాలిమర్‌పై ముద్రించి 5 నగరాల్లో ఫీల్డ్ ట్రయల్ నిర్వహించాలని కూడా నిర్ణయించారు.
2014లోనూ ఇదే అంశంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ కూడా ఇచ్చింది. 2017లో కూడా 5 ప్రాంతాల్లో ప్లాస్టిక్ బ్యాంక్‌నోట్ల ఫీల్డ్ ట్రయల్‌కు అనుమతి ఇచ్చినట్టు కేంద్రం ప్రకటించింది. పాలిమర్ నోట్లు తీసుకురావడానికి ముఖ్యమైన ఉద్దేశం ఒకటే.. నోట్ల లైఫ్ పెంచడమేనని అప్పట్లోనే కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
నోట్లపై ఫొటో మార్చే ఛాన్స్ ఉందా? :
సాంకేతికపరంగా చూస్తే.. కరెన్సీ నోటు డిజైన్ మార్చే విధానం ప్రస్తుత చట్టంలో ఉంది. గతంలోనూ కరెన్సీ డిజైన్, సేఫ్టీ ఫీచర్లు, సైజు వంటి అంశాల్లో మార్పులు జరిగాయి. 1996 నుంచి మహాత్మా గాంధీ ఫొటోతో సిరీస్ అమల్లోకి వచ్చింది.
ఇప్పుడు గాంధీ స్థానంలో కొత్త వ్యక్తి ఫొటో పెట్టాలంటే మాత్రం ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సిఫారసులు, కేంద్ర ప్రభుత్వ ఆమోదం వంటి ప్రక్రియ తప్పనిసరిగా ఉండాల్సిందే. ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయి కదా.. ఇక గాంధీ ఫొటోను కూడా కరెన్సీలో మార్చేస్తారులే అనడంలో ఎలాంటి వాస్తవం లేదు.
ఫొటో మార్పుతో ఇబ్బందులేంటి? :
ఒకప్పుడు భారత కరెన్సీ నోటుపై బ్రిటన్ రాజు ఫొటో ఉండేది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన చాలా యేళ్ల తర్వాత భారత కరెన్సీపై గాంధీ ఫొటోను ముద్రించారు. అప్పటినుంచి మనం గాంధీ ఫొటోనే చూస్తున్నాం.. ఒకవేళ గాంధీ స్థానంలో మరో స్వాతంత్య్ర సమరయోధుడు లేదా జాతీయ నాయకుడిని ఎంపిక చేస్తే వర్గాల పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు.
దేశంలో అనేక భిన్న సంస్కృత్తులు, మతాలు, కులాలు, నాయకులు, వేర్వేరు పార్టీలు ఉండటం వల్ల అందరికీ ఆమోధయోగ్యమైన వ్యక్తిని నిర్ణయించడం ప్రస్తుత విధానంలో కష్టమే..
మరోవైపు.. గాంధీ స్థానంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఫొటోను ముద్రించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనాప్పటికీ మహ్మాత్మాగాంధీని జాతిపితగా అందరూ గుర్తించడమే ఆయన ఫొటోను నోట్లపై ఇంతకాలం ముద్రించడానికి అసలు కారణం.. ఆయన స్థానంలో మరొకరి ఫొటోను ఊహించుకోవడం కష్టమే..
