UPI Payments : ఫోన్‌పే యూజర్లకు కంపెనీ బంపర్ ఆఫర్.. ఇక లైఫ్ లాంగ్..
UPI Payments : లోక్‌సభలో కొత్త పన్ను సవరణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో యూపీఐ చెల్లింపులు ఉచితంగానే కొనసాగుతాయని ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్ 'ఎక్స్' వేదికగా స్పష్టం చేశారు.
UPI Payments
- ఫోన్‌పే యూజర్లకు బంపర్ న్యూస్.. యూపీఐపై ఛార్జీలకు చెక్
- యూజర్లకు యూపీఐ పేమెంట్లు ఉచితంగానే కొనసాగుతాయి
- యూపీఐ పేమెంట్లకు ఎలాంటి ఛార్జీలు లేవని ఫోన్‌పే సీఈఓ ప్రకటన
- రూ. 2వేలకు పైగా, మర్చంట్ యూపీఐ పేమెంట్లకు MDR వర్తించవచ్చు
UPI Payments : యూపీఐ వాడుతున్నారా? ఇకపై ప్రతి యూపీఐ లావాదేవీపై ఛార్జీ పడుతుందా? రూ.2,000 దాటితే డబ్బులు కట్ అవుతాయా? ఇలాంటి టెన్షన్ అక్కర్లేదు. సాధారణ యూజర్లకు యూపీఐ పేమెంట్లు ఫ్రీగానే కొనసాగుతాయని ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్ స్పష్టం చేశారు. అంటే.. రోజూ ఫోన్‌పేలో చేసే యూపీఐ పేమెంట్లకు ఇప్పటికైతే ఎలాంటి ఛార్జీలు వర్తించవు.
రూ.2,000 దాటినా పైసా కట్ కాదు :
కానీ, రూ.2వేలు దాటితే యూపీఐ ఛార్జీలు పడతాయంటూ ప్రస్తుతం తెగ చర్చ నడస్తోంది. చాలామందిలో అనేక సందేహాలు (UPI Payments) మొదలయ్యాయి. అయితే, సాధారణ యూపీఐ యూజర్లకు ఇప్పటికైతే ఛార్జీ లేదు. యూపీఐ పేమెంట్లు లైఫ్ లాంగ్ ఉచితంగానే ఉంటాయని ఫోన్‌పే సీఈఓ ప్రకటించడంతో యూజర్లకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి.
యూపీఐ ఛార్జీలపై జరుగుతున్న చర్చతో యూజర్లలో నెలకొన్న అనుమానాలకు ఫోన్‌పే ఫుల్ క్లారిటీ ఇచ్చింది. సాధారణ యూపీఐ యూజర్ల నుంచి చేసే లావాదేవీలకు ఛార్జీలు చేసే పరిస్థితి లేదని కంపెనీ స్పష్టం చేసింది.
అసలు కొత్త బిల్లు ఏంటి? :
లోక్‌సభ ఆమోదించిన పన్నులు, ఇతర చట్టాల (సవరణ) బిల్లు 2026 పలు చట్టాల్లో అనేక మార్పులు చేస్తుంది. ఇందులో పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007కు సంబంధించి ముఖ్యమైన మార్పు రానుంది. డిజిటల్ పేమెంట్లపై ఛార్జీలకు ఉన్న చట్టపరమైన పరిమితుల్లో మార్పులు చేసి కొన్ని ఎలక్ట్రానిక్ పేమెంట్లపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది.
అంటే.. బిల్లు ఆమోదం పొందిన తర్వాత ప్రతి యూపీఐ పేమెంట్‌పై ఛార్జీ పడుతుందని కాదు.. ఎలాంటి లావాదేవీలకు ఎండీఆర్ వర్తించాలి? ఎంత ఉండాలి? ఎవరికి వర్తించాలి? అన్నది ప్రత్యేక నిబంధనల ద్వారా నిర్ణయించాల్సి ఉంటుంది.
𝐔𝐏𝐈 𝐢𝐬 𝐚𝐧𝐝 𝐰𝐢𝐥𝐥 𝐫𝐞𝐦𝐚𝐢𝐧 𝐟𝐫𝐞𝐞 𝐟𝐨𝐫 𝐚𝐥𝐥 𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐜𝐨𝐧𝐬𝐮𝐦𝐞𝐫𝐬!
‘Consumers will NOT BE CHARGED anything for making UPI payments.
— Sameer Nigam (@_sameernigam) August 8, 2026
MDR ఛార్జీలు ఏంటి? :
ఒక మర్చంట్ యూపీఐ ద్వారా పేమెంట్ పొందితే.. ఆయా లావాదేవీని ప్రాసెస్ చేసే పేమెంట్ సిస్టమ్ రుసుమే ఎండీఆర్.. ప్రధానంగా మర్చంట్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ మధ్య ఉండే ఛార్జీ మాత్రమే.. అంతేకానీ యూజర్ల యూపీఐ ట్రాన్స్ఫర్ ఫీజు కాదు.
ప్రస్తుత ప్రతిపాదన ప్రకారం.. కొన్ని రూ.2వేలకు మించిన మర్చంట్ పేమెంట్లపై 0.25శాతం నుంచి 0.4శాతం వరకు ఎండీఆర్ ఉండొచ్చని తెలుస్తోంది. వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే సాధారణ యూపీఐ పేమెంట్లకు దీనికి వర్తించదు. రోజువారీ చిన్నచిన్న లావాదేవీల కోసం యూపీఐని ఎక్కువ వాడే వ్యాపారులకు భారీ ఊరట అని చెప్పొచ్చు.
చిన్న వ్యాపారులు, యూజర్లకు లాభమేంటి? :
మీ స్నేహితులు డబ్బు పంపడం, కుటుంబ సభ్యులకు ట్రాన్స్ఫర్ చేయడం వంటి P2P పేమెంట్లు ఫ్రీగానే ఉంటాయి. చిన్న కిరాణా స్టోర్లు, చిన్న వ్యాపారులపై కూడా ఎండీఆర్ భారం ఉండదని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.
అందుకే ప్రస్తుతానికి యూపీఐ ఛార్జీల చర్చ ఉన్నా సామాన్య యూజర్ల రోజువారీ యూపీఐ పేమెంట్లపై ఎలాంటి ఛార్జీలు పడటం లేదు. కొత్త బిల్లు ద్వారా భవిష్యత్తులో కొన్ని మర్చంట్ లావాదేవీలకు ఎండీఆర్ విధించే అవకాశం ఉండనుంది.
