Gautam Adani: మోదీ కాదట, రాజీవ్ గాంధీనట.. పారిశ్రామికవేత్తగా తన ఎదుగుదలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గౌతమ్ అదానీ

రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎగ్జిమ్ (ఎగుమతి-దిగుమతి) విధానం సరళీకరించినప్పుడే నా వ్యాపార ప్రస్థానం ముందుకు సాగడం ప్రారంభమైందని తెలిస్తే ఎంత మంది నమ్మగలరు? అలా అని ఆయన నాకు వ్యక్తిగతంగా లబ్ది చేకూర్చారనడం సరికాదు. ఇక నా వ్యాపార ఎదుగదలలో రెండవ ధఫా 1991లో పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్ ద్వయం భారీ ఆర్థిక సంస్కరణలు ప్రారంభించినప్పుడు.

Gautam Adani: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మధ్య సంబంధాలపై రాజకీయంగా అనేక విమర్శలు ఉన్నాయి. మోదీ ప్రధాని అయ్యాక దేశ సంపదను అప్పనంగా అదానీకి కట్టబెడుతున్నారని కాంగ్రెస్ సహా అనేక రాజకీయ పక్షాలు తరుచూ విమర్శలు చేస్తూనే ఉంటాయి. ఇక దేశ ప్రజానికం నుంచి కూడా ఈ విమర్శలు పెద్ద ఎత్తున్నే వస్తుంటాయి. అయితే ఈ ఆరోపణలపై గౌతమ్ అదానీ తొలిసారి స్పందించారు. నరేంద్రమోదీ తనకు అనుకూలంగా వ్యవహరించడం వల్ల తనకు వ్యాపారపరంగా లబ్ది చేకూరిందనే ఆరోపణల్ని ఆయన కొట్టిపారేశారు. వాస్తవానికి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే తన వ్యాపార ఎదుగుదల ప్రారంభమైందని, అది 30 ఏళ్ల శ్రమని అదానీ వెల్లడించారు.

Rahul Gandhi: ఎట్టకేలకు పెళ్లిపై సానుకూలంగా స్పందించిన రాహుల్ గాంధీ.. ఆ క్వాలిటీస్ ఉండే అమ్మాయి అయితే ఓకేనట

‘‘నేను, ప్రధానమంత్రి మోదీ ఒకే రాష్ట్రానికి చెందినవాళ్లం. బహుశా అందుకే చాలా సులభంగా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలు రావడం నిజంగా దురదృష్టకరం. మా గ్రూప్ విజయాల్ని స్వల్పకాలిక దృష్టితో చూడడం వల్ల పక్షపాతంతో చేస్తున్న విమర్శలు ఇవి. నా విజయాల వెనుక ఏ ఒక్క నాయకుడు లేడు.. అనేక మంది నాయకులతో పాటు ప్రభుత్వాలు ప్రారంభించిన విధానాల వల్ల, సంస్థాగత సంస్కరణల వల్ల ఈ స్థాయికి వచ్చాను. మూడు దశాబ్దాల సుదీర్ఘ శ్రమ ఇది’’ అని అదానీ అన్నారు.

Maha vs Karnataka: ముంబై ఎవడి బాబు సొత్తు కాదు, అదెప్పటికీ మహారాష్ట్రదే.. డిప్యూటీ సీఎం ఫడ్నవీస్

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎగ్జిమ్ (ఎగుమతి-దిగుమతి) విధానం సరళీకరించినప్పుడే నా వ్యాపార ప్రస్థానం ముందుకు సాగడం ప్రారంభమైందని తెలిస్తే ఎంత మంది నమ్మగలరు? అలా అని ఆయన నాకు వ్యక్తిగతంగా లబ్ది చేకూర్చారనడం సరికాదు. ఇక నా వ్యాపార ఎదుగదలలో రెండవ ధఫా 1991లో పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్ ద్వయం భారీ ఆర్థిక సంస్కరణలు ప్రారంభించినప్పుడు. ఆ సమయంలో అనేక పారిశ్రామికవేత్తలు లబ్ది పొందారు. అందులో నేను ఒకడిని. ఇక మూడవ మలుపు 1995లో గాజరాత్ ముఖ్యమంత్రిగా కేశూభాయ్ పటేల్ ఎన్నిక కావడం. ముంద్రాలో ఓడరేవు నిర్మించడానికి దారి తీసిన పరిణామం అప్పుడే జరిగింది. నాల్గవ సారి గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ అయినప్పుడు’’ అని అన్నారు.

Pragya Thakur: హిందువులు కత్తులు వాడాలంటూ వ్యాఖ్యానించిన బీజేపీ ఎంపీ సాధ్వీపై కేసు

‘‘ఇన్ని ప్రభుత్వాలు అవలంబించిన విధానాల కారణంగా మా వ్యాపారాల్ని ముందుకు తీసుకెళ్లగలిగాం. ప్రస్తుతం మోదీ సమర్థ నాయకత్వంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మేము అదే విధమైన పునరుజ్జీవాన్ని చూస్తున్నాం. భారత్‌లోని మిలియన్ల మంది వర్ధమాన పారిశ్రామికవేత్తలకు ధీరూభాయ్ అంబానీ స్ఫూర్తిదాయకం. ఎలాంటి మద్దతు, వనరులు లేని వ్యక్తి, అన్ని అసమానతలకు వ్యతిరేకంగా నిలబడి, ప్రపంచ స్థాయి వ్యాపార సమూహాన్ని ఏర్పాటు చేశారు. మొదటి తరం వ్యవస్థాపకుడు. నేను ఆయన నుంచి చాలా ప్రేరణ పొందాను’’ అని అదానీ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు