×
Ad

EPFO Salary Bank : మీ శాలరీకి అకౌంట్ నెంబర్ ఏది ఇచ్చారు? మార్చారా? వెంటనే ఈ పనిచేయండి.. లేకపోతే అదో తలనొప్పి..!

EPFO Salary Bank : మీ జీతం ఏ బ్యాంకు ఖాతాలో పడుతుంది? ఎప్పుడైనా బ్యాంకు అకౌంట్ మార్చారా? అయితే, ఈ పని వెంటనే చేయడం బెటర్? ఎందుకంటే?

  • Published On : February 17, 2026 / 04:51 PM IST

EPFO Salary Bank

  • మీ శాలరీ అకౌంట్ మారిందా? ఇంకా అప్ డేట్ చేయలేదా?
  • పీఎఫ్ అడ్వాన్స్ తీసుకునే ముందు UAN అకౌంట్ చేయండి
  • పీఎఫ్ డబ్బులు తీసుకోవాలంటే పాత బ్యాంకు అకౌంట్ అప్ డేట్ తప్పనిసరి
  • శాలరీ అకౌంట్ మార్చితే పీఎఫ్ ఖాతాలో కూడా మార్చడం మర్చిపోవద్దు

EPFO Salary Bank : మీరు కొత్త జాబ్ జాయిన్ అయ్యారా? లేదా మీ బ్యాంకు అకౌంట్ నెంబర్ రీసెంట్ గా మార్చారా? అసలు మీ శాలరీ ఏ బ్యాంకు అకౌంటులో పడుతుంది? బ్యాంకు సర్వీసు బాగోలేదని తక్కువ ఛార్జీలు ఉండే బ్యాంకులో మైగ్రేట్ అయ్యారా? అయితే మీరు ఈ విషయం అసలు మర్చిపోవద్దు.. చాలామంది ఇక్కడే రాంగ్ చేస్తుంటారు. బ్యాంకు అకౌంట్ మార్చాం కదా అంతా అయిపోయిందిలేని భావిస్తుంటారు.

మీకు ప్రతినెలా జీతం పడినట్టే పీఎఫ్ ఖాతా డబ్బు కూడా పడుతుంది.. మరి ఆ డబ్బును విత్ డ్రా చేసుకుంటే అది మీరు గతంలో ఇచ్చిన బ్యాంకు అకౌంట్లోనే పడుతుందిగా. మీరు కూడా ఈ విషయం మర్చిపోతే మీ పీఎఫ్ డబ్బులు రావు.. ఇంతకీ మీరు ఏం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

చాలామంది బ్యాంకు అకౌంట్ అయితే మార్చుకుంటారు కానీ, ఈపీఎఫ్ఓ అకౌంటులో బ్యాంకు నెంబర్ మార్చడం మర్చిపోతుంటారు. సాధారణంగా మీ UANతో లింక్ అయిన బ్యాంకు అకౌంటులోనే పీఎ డబ్బులు డిపాజిట్ అవుతాయి.

మీరు ఒకవేళ పాత బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేసినా లేదా ఇన్ యాక్టివ్ గా ఉన్నా మీరు ఆ డబ్బును పొందలేరు. క్లెయిమ్ ప్రాసెస్ నిలిచిపోతుంది. ఇంతకీ మీ పీఎఫ్ యూఏఎన్ నంబర్‌తో ఏ బ్యాంకు అకౌంట్ లింక్ అయిందో ముందుగా చెక్ చేసుకోండి..

మీ పీఎఫ్ ఖాతాను చెక్ చేసుకోండి :
ముందుగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులు ఈ-సేవా పోర్టల్ లాగిన్ అవ్వండి. మీ UAN నెంబర్ కు ఏ బ్యాంకు అకౌంట్ లింక్ అయిందో చెక్ చేయండి. చాలామంది జాబ్ మారినప్పుడు బ్యాంకు అకౌంట్ కూడా ఆటోమాటిక్ గా అప్ డేట్ అవుతుందని భావిస్తుంటారు. వాస్తవానికి అలా జరగదు.

అలాగే, మీ ఆధార్ కార్డు కూడా వెరిఫై అయిందో లేదో చెక్ చేయండి. ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు వివరాలు అన్ని సరిగ్గా ఉంటేనే మీ పీఎఫ్ క్లెయిమ్ ప్రాసెస్ అవుతుంది. అందులో ఏ కొంచెం స్పెల్లింగ్ రాంగ్ ఉన్నా మీకు క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతాయి. ఏదైనా వివరాలు మ్యాచ్ కాకపోతే ముందుగా వాటిని గుర్తించి అప్ డేట్ చేసుకోండి.

బ్యాంక్ అకౌంంట్ ఎలా మార్చాలి? :

మీరు UAN అకౌంటులోకి లాగిన్ అయ్యాక ‘Manage’సెక్షన్ కు వెళ్లి KYC పై క్లిక్ చేయండి. అక్కడే మీకు KYCకు సంబంధించి ఫుల్ లిస్ట్ కనిపిస్తుంది. మీ కొత్త బ్యాంకు అకౌంట్ నెంబర్, IFSC కోడ్ జాగ్రత్తగా యాడ్ చేయండి. మీ నంబర్ ఒకటికి రెండు సార్లు చెక్ చేయండి. ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తుంటారు. అవసరమైతే క్యాన్సిల్ చెక్ కూడా ఫొటో క్లియర్ కనిపించేలా చేసి అప్ లోడ్ చేయండి.

Read Also : AI Impact Summit 2026 : వచ్చే 5 ఏళ్లలో ఆ ఐటీ జాబ్స్ మటాష్.. అంతా AI ఆధిపత్యమే.. టెక్ బిలియనీర్ సంచలన కామెంట్స్

ఆ తర్వాత మీ రిక్వెస్ట్ డైరెక్ట్ అప్రూవల్ కాదు. ముందుగా కంపెనీ HR వద్దకు వెళ్తుంది. ఆ విషయం చాలామందికి తెలియదు. ఒకవేళ హెచ్ఆర్ రిక్వెస్ట్ ఆమోదించకపోతే బ్యాంకు అప్ డేట్ మారదు. ముందుగా అప్రూవల్ కోసం వేచి చూడాలి. అవసరమైతే ఒకసారి అడిగి అప్రూవల చేయించుకోండి. లేదంటే మీ పీఎఫ్ డబ్బును తీసుకోలేరు.

ఈ ప్రాసెస్ ఎందుకు అవసరమంటే? :
మీరు పీఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ విత్ డ్రా కోసం అప్లయ్ చేశాక మీ బ్యాంకు వివరాలు తప్పుగా ఉంటే ఈపీఎఫ్ఓ పేమెంట్ ప్రాసెస్ కాదు. వెంటనే రిజెక్ట్ అవుతుంది. మళ్లీ మీరు క్లెయిమ్ ప్రాసెస్ మొదటి నుంచి చేయాల్సి ఉంటుంది.

మీరు పాత కంపెనీలో ఉద్యోగం మానేసిన తర్వాత డబ్బు విత్ డ్రా చేసుకుంటే లేదా పీఎఫ్ అడ్వాన్స్ కోసం అప్లయ్ చేసుకున్న సమయంలో బ్యాంకు అకౌంట్ సమస్య మీకు పెద్ద తలనొప్పిగా మారతుంది. మీకు అవసరం లేని సమయంలోనే బ్యాంకు అకౌంట్ అప్ డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం.

తప్పక గుర్తుంచుకోవాల్సినవి :
మీ UAN కింద ఒకేసారి ఒక బ్యాంక్ అకౌంట్ మాత్రమే యాక్టివ్‌గా ఉంటుంది. మీరు జాబ్ మారినప్పుడు మీ UAN మారదు. మీ కెరీర్ మొత్తం అలానే ఉంటుంది. అందుకే మీ శాలరీ బ్యాంకు మారినప్పుడల్లా ఈపీఎఫ్ఓ బ్యాంకు అకౌంట్ కూడా మార్చుకోవడం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఇది కేవలం 5 నిమిషాల పని.. ఇది ఒకసారి కంప్లీట్ చేస్తే వారాల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.

FAQ : ఈపీఎఫ్ఓలో బ్యాంకు అకౌంట్ అప్ డేట్ చేయడం ఎలా?

1. కంపెనీ యజమాని పర్మిషన్ లేకుండా నా ఈపీఎఫ్ఓ బ్యాంకు అకౌంట్ అప్‌డేట్ కుదరదా?
చాలావరకూ కేవైసీ అప్‌డేట్స్ కోసం యజమాని అప్రూవల్ అవసరం. అది లేకుండా, బ్యాంక్ నెంబర్ అప్‌డేట్ పూర్తిగా వెరిఫై చేయలేరు.

2. నేను ఒకటి కన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను ఈపీఎఫ్ఓకు లింక్ చేయవచ్చా?
లేదు. చేయలేం.. ఒకేసారి ఒక ప్రైమరీ బ్యాంకు అకౌంట్ మాత్రమే మీ UANకి లింక్ చేసి విత్ డ్రా చేసుకోవచ్చు.

3. నేను ఉద్యోగాలు మారితే ఏమవుతుంది?
మీ UAN నెంబర్ మారదు. అలాగే ఉంటుంది. కొత్త కంపెనీతో మీ జీతం అకౌంట్ మారితే భవిష్యత్తులో క్లెయిమ్‌ ప్రాసెస్ చేయలేరు. ఇందుకోసం మీ ప్రస్తుత UAN కింద ఉన్న బ్యాంక్ వివరాలను వెంటనే కొత్త అకౌంటుకు మార్చుకోండి.