Chicken And Egg Price Hike: చికెన్ ప్రియులకు భారీ షాక్.. కిలో ఏకంగా రూ.500? పౌల్ట్రీ పరిశ్రమలో సంక్షోభం!
నిత్యం సామాన్యుడి కనీస ఆహారంలో భాగమైన చికెన్, గుడ్ల ధరలు (Chicken And Egg Price Hike)త్వరలోనే ఆకాశాన్ని తాకే ప్రమాదం కనిపిస్తోంది.
- V Santhosh Kumar
- Published on- October 3, 2026 / 04:54 PM IST
Chicken and egg prices set to rise sharply.
Chicken And Egg Price Hike: నిత్యం సామాన్యుడి కనీస ఆహారంలో భాగమైన చికెన్, గుడ్ల ధరలు త్వరలోనే ఆకాశాన్ని తాకే ప్రమాదం కనిపిస్తోంది. పౌల్ట్రీ పరిశ్రమను వేధిస్తున్న దాణా కొరత, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణముగా మార్కెట్‌లో చికెన్, గుడ్ల ధరలు(Chicken And Egg Price Hike) విపరీతంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసరాల ధరల భారాన్ని మోస్తున్న సామాన్యులకు, ముఖ్యంగా మాంసాహార ప్రియులకు ఇది కోలుకోలేని పెద్ద షాక్‌గా మారనుంది.
ధరల పెంపునకు ప్రధాన కారణం.. దాణా ధరల భారం:
కోళ్ల పెంపకంలో ఉపయోగించే దాణాలో దాదాపు 55 నుంచి 60 శాతం వరకు మొక్కజొన్ననే వాడతారు. అయితే, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో బయో ఇంధనంగా ఇథనాల్ వాడకాన్ని ప్రోత్సహించడంతో, పెట్రోల్ కంపెనీలు భారీగా మొక్కజొన్నను కొనుగోలు చేస్తున్నాయి. దీనితో పౌల్ట్రీ రంగానికి మొక్కజొన్న లభ్యత తగ్గడంతో పాటు దానికి తీవ్రమైన కొరత ఏర్పడి, దాణా ఉత్పత్తి వ్యయం రికార్డు స్థాయిలో పెరిగింది.
ఎల్‌నినో ప్రభావం.. మరింత ప్రియం కానున్న చికెన్, గుడ్డు:
మరొకవైపు, సూపర్ ఎల్‌నినో ప్రతికూల ప్రభావం వల్ల సంభవించిన వర్షాభావ పరిస్థితులు మొక్కజొన్న దిగుబడిని మరింతగా తగ్గించాయి. దీంతో ముడిసరుకుల కొరత మరింత తీవ్రమై పౌల్ట్రీ యజమానులకు కోళ్ల పెంపకం భారంగా మారింది. ఈ పరిస్థితుల వల్ల రాబోయే రోజుల్లో కిలో చికెన్ ధర రూ.400 నుంచి రూ.500 వరకు, అలాగే ఒక్కో గుడ్డు ధర రూ.20 వరకు పెరిగే అవకాశముందని పౌల్ట్రీ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
