CIBIL Score : మీ CIBIL స్కోర్ 700 కన్నా తగ్గిందా? బ్యాంకు లోన్ రిజెక్ట్ అవుతుందా? వడ్డీ రేట్లు పెరుగుతాయా? పూర్తి నిజం ఇదే!

CIBIL Score : 700 కన్నా తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే బ్యాంకులు లోన్లు ఇచ్చేందుకు ముందుకు రావు. భవిష్యత్తులో రుణాలు, క్రెడిట్ కార్డులు పొందలేరు. వడ్డీ రేట్లు కూడా భారీగా పెరుగుతాయి. ముఖ్యంగా గృహ రుణాలు, ప్రీమియం క్రెడిట్ కార్డులు పొందడం చాలా కష్టంగా మారుతుంది.

CIBIL Score

  • అసలు క్రెడిట్ స్కోరు ఎంత ఉండాలి?
  • బ్యాంకులు లోన్లు, క్రెడిట్ కార్డులు ఎవరికి ఇస్తాయి?
  • 700 కన్నా సిబిల్ స్కోరు తక్కువగా ఉంటే జరిగే నష్టాలేంటి?

CIBIL Score : మీ సిబిల్ స్కోరు ఎంత? ఎప్పుడైనా చెక్ చేశారా? సాధారణంగా మీకు ఏదైనా కొత్త క్రెడిట్ కార్డు కావాలన్నా లేదా లోన్ కోసం చూస్తుంటే ప్రతి బ్యాంకు ఈ సిబిల్ స్కోరునే చూస్తుంది. అత్యవసరంగా పెద్ద మొత్తంలో లోన్ అవసరమయ్యేవరకు చాలామంది ఈ క్రెడిట్ స్కోరు గురించి పెద్దగా పట్టించుకోరు.

మన సిబిల్ స్కోర్ 700 కంటే కొద్దిగా తగ్గినా పెద్ద సమస్యేమీ కాదని  (CIBIL Score) అనుకుంటారు. కానీ, ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ 700 సిబిల్ స్కోరు మార్కు ‘లక్ష్మణ రేఖ’ లాంటిది. ఒకసారి ఈ మార్క్ దాటితే మీ పట్ల బ్యాంకుల వైఖరి పూర్తిగా మారిపోతుంది.

అసలు గేమ్ ఇక్కడే :
మీ సిబిల్ స్కోర్ 700 కన్నా తక్కువగా ఉంటే రాత్రికి రాత్రే ఏం జరగదు. మీ ప్రస్తుత క్రెడిట్ కార్డులు అన్నీ పనిచేస్తాయి. మీ ప్రస్తుత లోన్ ఈఎంఐలు కూడా అలాగే ఉంటాయి. కానీ, మీరు కొత్త క్రెడిట్ కార్డు కోసం అప్లయ్ చేసినప్పుడు అసలు గేమ్ మొదలవుతుంది. బ్యాంకులు మిమ్మల్ని లో రిస్క్ ఉన్న కస్టమర్ నుంచి మిడ్ రిస్క్ కస్టమర్‌గా పరిగణిస్తుంది.

లోన్లు ఖరీదైనవిగా మారొచ్చు :
వడ్డీ రేట్ల రూపంలో మీ జేబుపై అదనపు భారం పడుతుంది. 750 కన్నా ఎక్కువ స్కోర్ ఉన్న వారికి బ్యాంకులు అతి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందిస్తాయి. మీ స్కోర్ 700 కన్నా తక్కువకు ఉంటే బ్యాంకులు “రిస్క్ ప్రీమియం” వసూలు చేస్తాయి. మీ వ్యక్తిగత రుణం లేదా కార్ లోన్ ఇతరుల కన్నా 2శాతం నుంచి 5శాతం వరకు ఎక్కువ ఖరీదైనదిగా ఉండొచ్చు. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల కాలంలో లక్షల్లో అదనపు భారంగా మారవచ్చు.

Read Also : Realme Narzo 100 Lite 5G : 7000mAh బ్యాటరీ, రియల్‌మి కొత్త నార్జో 100 లైట్ 5జీ వస్తోంది.. ఏప్రిల్ 14నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చంటే?

గృహ రుణాలు, క్రెడిట్ కార్డులపై ఎఫెక్ట్ :
1. గృహ రుణాల కోసం 750+ స్కోరు ఉన్న కస్టమర్లను బ్యాంకులు ‘ప్రైమ్’గా పరిగణిస్తాయి. 700 కన్నా తక్కువ స్కోరు ఉంటే వడ్డీ రేట్లు పెరగడమే కాదు బ్యాంకులు అదనపు డాక్యుమెంట్లను కూడా అడగవచ్చు.

2. ప్రీమియం కార్డులు వద్దు : మీరు రివార్డ్ పాయింట్లు, ఎయిర్ మైల్స్‌తో ప్రీమియం క్రెడిట్ కార్డులు కావాలంటే మీకు తక్కువ సిబిల్ స్కోరు ఉంటే పొందలేరు. బ్యాంకులు మీకు కేవలం బేసిక్ కార్డులను మాత్రమే అందిస్తాయి. మీ క్రెడిట్ లిమిట్ పెంచాలన్నా మీ రిక్వెస్ట్ కూడా రిజెక్ట్ చేయొచ్చు.

700 కన్నా తక్కువ సిబిల్ స్కోరు ఉంటే జాగ్రత్త.. మీ గత పేమెంట్ హిస్టరీని బ్యాంకులు నిశితంగా పరిశీలిస్తాయి. సిబిల్ స్కోరు తగ్గడానికి కారణం మీ నిర్లక్ష్యం లేదా ఆలస్యంగా పేమెంట్లు చేయడం అయితే భవిష్యత్తులో మీకు పెద్ద మొత్తంలో లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు వెనుకాడవచ్చు. 700 కన్నా తక్కువ క్రెడిట్ స్కోరు ఉంటే మీకు ఎప్పటికీ లోన్లు రావని అర్థం కాదు. సకాలంలో పేమెంట్లు చేయడం, క్రెడిట్ వినియోగం తక్కువగా ఉంటే మళ్లీ సిబిల్ స్కోరు పెరిగే అవకాశం ఉంటుంది.