Delhi-NCR Pollution : ఢిల్లీ కాలుష్యానికి చెక్ పెట్టాలా? మీ ఇంటికి ఈ 5 ప్రీమియం ఎయిర్ ప్యూరిఫైయర్లు బెస్ట్!
Delhi-NCR Pollution : ఢిల్లీ-NCRలో పెరుగుతున్న వాయు కాలుష్యం నేపథ్యంలో ఇంట్లో స్వచ్ఛమైన గాలి కోసం ఎయిర్ ప్యూరిఫైయర్ కొనాలనుకుంటున్నారా? హనీవెల్, బ్లూఎయిర్, డైసన్ సహా ఐదు ప్రీమియం మోడల్స్, వాటి ధరలు, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published on- November 12, 2026 / 07:40 PM IST
Delhi-NCR Pollution
- ఢిల్లీ-NCR కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా?
- రూ.25 వేల నుంచి ప్రీమియం ఎయిర్ ప్యూరిఫైయర్లు
- మీ ఇంటికి రక్షణగా నిలిచే 5 ఎయిర్ ప్యూరిఫైయర్లు
Delhi-NCR Pollution : దేశ రాజధాని ఢిల్లీతో పాటు NCR ప్రాంతాల్లో వాయు కాలుష్యం రోజురోజుకూ ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా చలికాలం ప్రారంభం కావడంతో గాలిలో కాలుష్య కణాల స్థాయిలు పెరుగుతున్నాయి. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (CSE) విశ్లేషణ ప్రకారం.. దీపావళి తర్వాత ఈ ఏడాది ఢిల్లీలో నమోదైన సగటు PM2.5 లెవల్స్ గత మూడేళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ఠానికి చేరుకున్నాయి..
ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వెళ్లినప్పుడే కాదు.. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎయిర్ క్వాలిటీపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే చాలామంది ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైయర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న 5 ప్రీమియం మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. హనీవెల్ ఎయిర్ టచ్ U1 :
ఈ లిస్టులో మొదటిది హనీవెల్ ఎయిర్ టచ్ U1. దీని ధర అమెజాన్‌లో రూ.24,997 ఉండగా, గంటకు 700 క్యూబిక్ మీటర్ల CADR సామర్థ్యంతో పనిచేస్తుంది. 1,085 చదరపు అడుగుల వరకు విస్తీర్ణానికి సరిపోతుందని కంపెనీ చెబుతోంది. ప్రీ-ఫిల్టర్, H13 HEPA, నానో సిల్వర్ అయాన్ లేయర్, యాక్టివేటెడ్ కార్బన్‌తో 4 దశల ఫిల్ట్రేషన్ ఇందులో ఉంది..
2. బ్లూఎయిర్ 211i మ్యాక్స్ :
స్మార్ట్ ఫీచర్లు కోరుకునేవారికి ఈ మోడల్ అద్భుతంగా ఉంటుంది. అమెజాన్ ధర రూ.26,200 ఉండగా వై-ఫై కనెక్టివిటీ, స్మార్ట్ సెన్సార్లు, అలెక్సా వాయిస్ కంట్రోల్, జియోఫెన్సింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సౌండ్ కూడా 23dB లెవల్ వరకు తక్కువగా ఉంటుందని సంస్థ పేర్కొంది.
Read Also :
3. డైసన్ హష్జెట్ HJ10 :
రూ.29,900 ధరతో ఈ మోడల్ 1,076 చదరపు అడుగుల వరకు కవర్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. అలెక్సా, సిరి, గూగుల్ హోమ్ సపోర్ట్ కూడా అందిస్తుంది.
4. కుకూ ఎయిర్ హీల్ :
రూ.36,927 ధరకు ఈ ప్యూరిఫైయర్ 724 m³/h CADR సామర్థ్యాన్ని అందిస్తుంది. రెండు H13 ట్రూ HEPA ఫిల్టర్లు, ప్రీ-ఫిల్టర్, యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ ఉన్నాయి.
5. కోవే ఎయిర్మెగా 350 :
ఈ లిస్టులో అత్యధిక ధర పలికే మోడల్ ఇది. అమెజాన్‌లో రూ.38,999కు అందుబాటులో ఉంది. 980 చదరపు అడుగుల వరకు కవర్ చేస్తుంది.. HEPA, యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్లు ఇందులో ఉన్నాయి.
ఏది కొనాలి? :
ఎయిర్ ప్యూరిఫైయర్ కొనేటప్పుడు ధర ఒక్కటే కాదు.. గది విస్తీర్ణం, CADR, ఫిల్టర్ ధర, మెయింట్ నెన్స్ ఖర్చు, సౌండ్ వంటి అంశాలను కూడా చెక్ చేయాలి.. ముఖ్యంగా మీ గది పరిమాణానికి సరిపోయే మోడల్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. కంపెనీలు చెబుతున్న కవరేజ్ వివరాలతో పాటు స్వతంత్ర పరీక్షల సమాచారాన్ని కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం బెటర్..
