Imports Jewellery : ఆభరణాలు కొనే వారికి భారీ షాక్.. బంగారం, వెండి నగలపై కేంద్రం కఠిన నియమాలు.. మరింత పెరగనున్న ధరలు

Imports Jewellery : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో నగలు కొనేవారిపై మరింత భారం పడనుంది.

Directorate General of Foreign Trade Imposed fresh curbs on imports jewellery

  • దిగుమతి ఆభరణాలపై కఠిన నియమాలు
  • ఇకపై లైసెన్స్ లేకుండా దిగుమతి చేసుకోలేరు
  • నగలు కొనేవారిపై ప్రభావం

Imports Jewellery : అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎంత పెరిగినా సరే.. మన ఇండియాలో మాత్రం అమ్మకాలు అస్సలు తగ్గవు. మన వారికి బంగారంపై ఉన్న ఇష్టమే అందుకు కారణం. చిన్న చిన్న శుభకార్యాలు మొదలు.. పెళ్లిళ్ల వరకు చాలా మంది నగలు కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆభరణాల దిగుమతి నిబంధనలను మరింత కఠినం చేసింది. దేశీయ ఆభరణాల పరిశ్రమను కాపాడటంతో పాటు.. ఫ్రీ ట్రేడ్ ఒప్పందాల (FTA) దుర్వినియోగాన్ని అరికట్టడానికి గాను కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు స్వేచ్ఛగా దిగుమతి చేసుకుంటున్న అనేక ఆభరణాలు.. ఇకపై లైసెన్స్ లేకుండా రావు. వీటిని దిగుమతి చేసుకోవాలంటే.. కచ్చితంగా లైసెన్స్ తీసుకోవాల్సిందే.

తాజాగా కేంద్రం కస్టమ్స్ టారిఫ్ హెడ్డింగ్ (CTH) 7113 కింద ఉన్న వస్తువుల దిగుమతి విధానాన్ని “ఫ్రీ” నుంచి “రెస్ట్రిక్టెడ్”గా మార్చింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఏప్రిల్ 1న ఆదేశాలు జారీ చేసింది. ఈ కారణంగా.. కష్టమైన ఫిలిగ్రీ పనితనం ఉండే వెండి నగలు, విలువైన రాళ్లు, ముత్యాలు, వజ్రాలు పొదిగిన ఆభరణాలు, ప్లాటినం నగలు, పుత్తడి, వెండి పూతతో చేసిన బేస్ మెటల్ ఆభరణాలన్నింటినీ ఇక నుంచి దిగుమతి చేసుకోవాలంటే.. DGFT లైసెన్స్ తీసుకోవాల్సిందే. ఈ పరిమితులు వెంటనే అమల్లోకి వస్తాయని, ఇప్పటికే ఉన్న ఒప్పందాలు, అడ్వాన్స్ చెల్లింపులు, లెటర్స్ ఆఫ్ క్రెడిట్ లేదా షిప్‌మెంట్ స్థితి ఉన్నా కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. మధ్యంతర సడలింపులు ఇవ్వబోమని తెలిపింది.

Gold : భారతదేశంలో ఇళ్లు, ఆలయాల్లో ఎంత బంగారం ఉందో తెలుసా..? వామ్మో.. వీటి విలువ ఎంతంటే..

అయితే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడానికి గల ప్రధాన కారణం.. చాలా మంది థాయ్‌లాండ్, ASEAN దేశాల నుంచి విలువైన ఆభరణాలను దిగుమతి చేసుకుంటూ.. డ్యూటీ-ఫ్రీ తేడాలను వినియోగించుకుని దిగుమతి చేసుకుంటున్నారు. ఇలా విదేశాల నుంచి వచ్చే చవకైన ఆభరణాలు దేశీయ మార్కెట్‌ను దెబ్బతీస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. FTAల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు.. ప్రధాన నగరాల్లో ఉన్న చిన్న, పెద్ద బంగారు, వెండి ఆభరణాల తయారీ యూనిట్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. వాటిని రక్షించేందుకు గాను DGFT లైసెన్స్‌ను తప్పనిసరి చేసింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది.

Gold Rate Today : భారీగా పతనమైన బంగారం ధర.. మళ్లీ రూ.లక్షకు దిగొస్తుందా? కారణాలివే.. నేటి గోల్డ్, సిల్వర్ ధరలు ఇలా..

ఈ నిర్ణయం వల్ల స్థానిక నగల తయారీ కళాకారుల భరోసా పెరుగుతుందని.. అలాగే స్థానికంగా తయారు చేసే ఆభరణాల నాణ్యత పెరగడమే కాక హాల్‌మార్క్‌పై మరింత విశ్వాసం పెరుగుతుందంటున్నారు. కాకపోతే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే డిజైన్లు కాస్త ఖరీదుగా మారతాయంటున్నారు.

వీరికి మినహాయింపు:

అయితే ఈ నిబంధనల నుంచి ఎగుమతి ఆధారిత యూనిట్లకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ (SEZ), 100 శాతం ఎక్స్‌పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ (EOU)లు నగలను ఎగుమతి చేయడం కోసం ముడి సరుకును దిగుమతి చేసుకుంటే.. వాటికి ఈ నిబంధనలు వర్తించవు. భారత్, యూఏఈ FTA కింద అనుమతించిన బంగారు ఆభరణాల దిగుమతులకు కూడా ఇది వర్తించదు. స్థూలంగా చెప్పాలంటే.. కేంద్రం కొత్త రూల్స్.. నగల ఎగుమతి వ్యాపారాన్ని ప్రభావితం చేయవు అని వెల్లడించారు. ఇవి కేవలం విలువైన లోహాల దిగుమతులను మాత్రమే ప్రభావితం చేస్తాయంటున్నారు.