Apple Price Hike : ఆపిల్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారత్‌లో భారీగా పెరిగిన ఐప్యాడ్, మ్యాక్‌బుక్ ధరలు.. కొత్త ధర తెలిస్తే కంగుతింటారు..!
Apple Price Hike : ఆపిల్, మ్యాక్‌బుక్, ఐప్యాడ్ సిరీస్‌లతో సహా వివిధ ప్రొడక్టుల ధరలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. M5 ప్రాసెసర్ మ్యాక్‌బుక్ ఎయిర్ ధర రూ. 1,19,900 నుంచి రూ. 1,49,900కు పెరగగా, 15-అంగుళాల వేరియంట్ ధర రూ. 35వేలు పెరిగి రూ. 1,79,000కు చేరింది.
Apple Price Hike
Apple Price Hike : ఆపిల్ లవర్స్ కు బిగ్ షాకింగ్ న్యూస్.. కొత్త ఆపిల్ మ్యాక్‌బుక్, ఐప్యాడ్ కొనేందుకు చూస్తున్నారా? ఆపిల్ ప్రొడక్టుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. కొద్ది రోజుల క్రితమే ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రొడక్టుల రేంజ్ ధరలను భారీగా పెంచబోతున్నట్లు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఆపిల్ మ్యాక్‌బుక్, ఐప్యాడ్, ఇతర డివైజ్ ధరలు భారీగా పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. ఆపిల్ అధికారికంగా ప్రకటించిన ప్రొడక్టుల ధరలు ఎంత పెరిగాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఆపిల్ ప్రొడక్టుల ధరల పెంపు :
భారత మార్కెట్లోకి M5 ప్రాసెసర్‌తో వచ్చిన మ్యాక్‌బుక్ ఎయిర్ రూ. 1,19,900 ధరకు లాంచ్ అయింది. ఇప్పుడు ఇదే డివైజ్ పెరిగిన ధరలతో రూ. 1,49,900కు లభిస్తోంది. అయితే, భారత మార్కెట్లో రూ. 1,44,900 ధరకు ఫస్ట్ టైమ్ లాంచ్ అయిన 15-అంగుళాల వేరియంట్ ఇప్పుడు రూ. 1,79,000 ధరకు లభిస్తోంది. అంటే దాదాపు రూ. 35వేలు పెరిగింది అనమాట.
ధరల సవరణ ప్రో వేరియంట్లపై కూడా ఆపిల్ M5 ప్రాసెసర్, 16GB ర్యామ్, బేస్ 14-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో, మార్కెట్లో రూ. 2,39,900 ధరకు లభ్యం కానుంది. లాంచ్ చేసినప్పుడు అసలు ధర రూ. 1,69,900 కన్నా దాదాపు రూ. 70వేలు ఎక్కువ. ఇప్పటివరకు ధరల పెంపులో అత్యధిక ధర ఇదే..
అంతేకాకుండా.. ఈ ధరల పెంపు ఆపిల్ బడ్జెట్ మోడల్ మ్యాక్‌బుక్ నియోపై కూడా ప్రభావం చూపింది. ఈ ల్యాప్‌టాప్ ఇప్పుడు అసలు ధర కన్నా రూ. 10వేల ఎక్కువకు అమ్ముడవుతోంది. అంతేకాదు.. ఆపిల్ M5 మ్యాక్స్ మ్యాక్‌బుక్ ప్రో ధర రూ. 1,00,000కు పెరిగింది.
ఆపిల్ మ్యాక్‌బుక్ M4 ప్రాసెసర్‌తో ఐప్యాడ్ ఎయిర్ ధర ఇప్పుడు రూ. 89,900గా నిర్ణయించింది. అంటే గతంలో ఈ డివైజ్ ధర రూ. 64,900కు లభిస్తుంది. మరోవైపు, ఐప్యాడ్ ప్రో పాత ధర కూడా రూ. 99,900 నుంచి ఇప్పుడు రూ. 1,39,900 ధరకు లభ్యమవుతోంది. ఈ ధరల ప్రభావం కచ్చితంగా వినియోగదారులపై పడుతుంది. ముఖ్యంగా ప్రో వేరియంట్ కొనుగోలు చేసేవారు కొనాలా? వద్దా ఆలోచించి తీసుకోవడం బెటర్..
