×
Ad

iPhone 17 Discount : ఐఫోన్ ప్రియులకు పండగే.. ఆపిల్ ఐఫోన్ 17 చాలా చీప్ గురూ.. ఈ ఐఫోన్ ఎందుకు కొనాలంటే?

iPhone 17 Discount : ఆపిల్ ఐఫోన్ 17 బేస్ వేరియంట్ ధర భారీగా తగ్గిందోచ్.. జెప్టోలో భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ ఐఫోన్ కొనాలా? వద్దా?

1/7
iPhone 17 Discount : ఆపిల్ ఐఫోన్ కొనాలని అనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి. ఆపిల్ ఐఫోన్ 17 భారీ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఇటీవలే కుపెర్టినోకు చెందిన టెక్ దిగ్గజం ఆపిల్ "అవే డ్రాపింగ్" ఈవెంట్‌లో ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లైనప్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్, సరికొత్త ఐఫోన్ ఎయిర్ కూడా ఉంది.
2/7
రిఫ్రెష్ కలర్ ఆప్షన్లతో ఆపిల్ లేటెస్ట్ A19 చిప్, 120Hz రిఫ్రెష్ రేట్, ఆకట్టుకునే కెమెరా అప్‌గ్రేడ్‌లతో మార్కెట్లో అత్యంత ఆకర్షణీయంగా మారాయి. ముఖ్యంగా భారత మార్కెట్లో ప్రీమియం ధర ఉన్నప్పటికీ ఈ ఐఫోన్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. రూ. 82,900 వద్ద లాంచ్ అయిన స్టాండర్డ్ ఐఫోన్ 17 మోడల్ ఇప్పుడు భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ క్రేజీ డీల్ జెప్టో ద్వారా ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
3/7
జెప్టోలో ఐఫోన్ 17పై బిగ్ డిస్కౌంట్ : ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్లపై అద్భుతమైన డీల్ అందిస్తోంది. ఈ పండగ సీజన్‌లో ముందుగా రూ.82,900 ధరకు లభించిన ఐఫోన్ 17 ఇప్పుడు జెప్టోలో కేవలం రూ.78,079కి లభ్యమవుతుంది. నేరుగా రూ.4,821 తగ్గింపు అందిస్తోంది. అంతేకాదు. కరూర్ వైశ్యా బ్యాంక్ వీసా కార్డులతో కస్టమర్లు అదనంగా రూ.500 తగ్గింపు పొందవచ్చు.
4/7
తద్వారా ధర రూ.77,579కి తగ్గుతుంది. దాంతో మొత్తం రూ.5,321 తగ్గింపు పొందవచ్చు. భారత మార్కెట్‌లోకి ఐఫోన్ 17 వచ్చిన తర్వాత ధర తగ్గడం ఇదే ఫస్ట్ టైమ్. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జెప్టో సూపర్-ఫాస్ట్ డెలివరీ, ఎంపిక చేసిన ప్రదేశాలలో 20 నిమిషాలలోపు మీ ఇంటి వద్దకే ఐఫోన్ 17 డెలివరీ చేస్తుంది.
5/7
ఐఫోన్ 17 స్పెసిఫికేషన్లు : ఐఫోన్ 17 మోడల్ 6.3-అంగుళాల ఎల్టీపీఓ సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 120Hz ప్రోమోషన్ రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, 3000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది. 3nm ప్రాసెస్‌పై ఆపిల్ A19 చిప్, 8GB ర్యామ్, 512GB వరకు NVMe స్టోరేజ్‌తో వస్తుంది.
6/7
కెమెరా విషయానికి వస్తే.. డ్యూయల్ 48MP బ్యాక్ సైడ్ సెటప్ (వైడ్ + అల్ట్రా-వైడ్), డాల్బీ విజన్ HDR వీడియోకు సపోర్టు ఇచ్చే కొత్త 18MP ఫ్రంట్ సెన్సార్ ఉన్నాయి. ఐఫోన్ iOS 26లో కూడా రన్ అవుతుంది. శాటిలైట్ కనెక్టివిటీ విషయానికి వస్తే.. UWB Gen2, IP68 వాటర్ రెసిస్టెన్స్‌ను అందిస్తుంది. వైర్డు, మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 3692mAh బ్యాటరీని అందిస్తుంది.
7/7
ఐఫోన్ 17 కొనాలా? వద్దా? : ఆపిల్ ఐఫోన్ 17 లాంచ్ తర్వాత రూ. 5వేల కన్నా ఎక్కువ తగ్గింపు పొందింది. మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. జెప్టోలో భారీ తగ్గింపు ధరకే ఐఫోన్ 17 సొంతం చేసుకోవచ్చు. పండగ సీజన్ సమయంలో తక్కువ ధరకే ఐఫోన్ 17 కొనాలంటే ఇదే బెస్ట్ టైమ్.. ఈ అద్భుతమైన డీల్ మీకోసమే..