E100 vs Petrol : పెట్రోల్ కన్నా ఇథనాల్ చౌకే.. మైలేజీలో ఏది బెటర్? రూ.20 తక్కువ ధర నిజంగా లాభమా?

E100 vs Petrol: భారత మార్కెట్లోకి E100 ఇంధనంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఖర్చులు, మైలేజీ విషయంలో, రోజువారీ వాహనదారులకు ఇది కష్టమే. ఈ కొత్త ఇంధన ప్రమాణాన్ని పెట్రోల్‌తో పోలిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు పరిశీలిద్దాం.

E100 vs Petrol

  • లీటర్‌కు రూ.20 వరకు తక్కువ ధర.. వాహనదారులకు లాభమేనా?
  • E100 ఫ్యూయల్ అంటే ఏంటి? పెట్రోల్‌ కన్నా ఎంతవరకు బెటర్?
  • లీటర్ ధర కన్నా కిలోమీటర్‌కు అయ్యే ఖర్చునే లెక్కించాలి

E100 vs Petrol : వాహనదారులకు బిగ్ అలర్ట్.. మీది కారు లేదా బైకు ఉందా? అది ఏదైనా సరే ఇకపై ఇథనాల్ ఫ్యూయల్ మాత్రమే వాడక తప్పదు. ఇథనాల్ అనేది నిజంగా క్లీన్ ఫ్యూయల్.. E100 అంటే.. 100 శాతం ఇథనాల్‌తో తయారైన ఇంధనంగా చెప్పొచ్చు.

ప్రస్తుతం వినియోగంలో E20తో పోలిస్తే.. E100 ఇథనాల్‌లో పెట్రోల్ అసలు ఉండదు. అయితే, సాధారణ పెట్రోల్ వాహనాల్లో E100 వాడకం మంచిది కాదు.. దీనికోసం ప్రత్యేక ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీతో పనిచేసే వాహనాలే చాలా బెటర్.

వాహనదారుల్లో అతిపెద్ద ప్రశ్న ఒకటే.. E100 ఇథనాల్ కాలుష్యాన్ని ఎంతవరకు తగ్గిస్తుంది. అలాగే, పెట్రోల్ (E100 vs Petrol) కన్నా E100 ఇంధనంతో రోజువారీ వినియోగం వాస్తవానికి ఎలా ఉంటుంది అనేది చర్చ నడుస్తోంది. పెట్రోల్‌తో పోలిస్తే.. E100 ఫ్యూయల్ ఫుల్ ట్యాంకు చేసినా తక్కువ ఖర్చు అవుతుందా?

సింగిల్ ఫుల్ ట్యాంక్‌పై కారు తక్కువ కిలోమీటర్లు ప్రయాణిస్తుందా? తక్కువ ధర, మైలేజీనే కాదు.. ఇంధన సామర్థ్యం, రియల్ మేనేజ్‌మెంట్ ఖర్చుల పరంగా E100 అనేది పెట్రోల్‌ కన్నా ఎంతవరకు బెటర్ అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

E100 ఇంధనం ఏంటి? :
E100 ఇథనాలు అనేది చాలా స్వచ్ఛమైనది. ఇది పెట్రోల్ మాదిరిగా కనిపించదు. ప్రస్తుతం E20 (20శాతం ఇథనాల్, 80శాతం పెట్రోల్) నిబంధనతో పోలిస్తే.. E100కు వందశాతం ఇథనాల్‌ను తట్టుకోగల ఫ్లెక్స్ ఫ్యూయల్.  అందుకే ప్రత్యేకంగా రూపొందించిన కొత్త వాహనాలు మార్కెట్లోకి రానున్నాయి.  ఈ ఇథనాల్ కోసం డిఫరెంట్ ఇంజిన్ కాలిబ్రేషన్‌, ఇథనాల్ కెమికల్ రియాక్షన్ తట్టుకోగల ఫ్యూయల్ లైన్లు, ఇంజెక్టర్లు, ఇతర పార్టులు కూడా ఉండాలి.

Read Also : Redmi K90 Ultra : 8,000mAh బ్యాటరీతో కొత్త రెడ్‌మి K90 అల్ట్రా వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్!

వైడ్ రేంజ్ ఇంజనీరింగ్ మార్పులు లేకుండా సాధారణ పెట్రోల్ కారులో E100ను నింపడం సాధ్యం కాదు. మరో తేడా ఏంటంటే.. ఇథనాల్ పెట్రోల్ కన్నా భిన్నంగా మండుతుంది. ఇంజిన్ నాకింగ్‌ను బాగా స్టాప్ చేయగలదు.

E100, పెట్రోల్ ధరల మధ్య తేడాలివే :
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.102.12 ఉంటే E100 ధర రూ.85 నుంచి రూ. 90 మధ్య ఉండొచ్చని అంచనా. అంటే.. లీటర్‌కు దాదాపు రూ.15 నుంచి రూ. 20 వరకు తక్కువ ధరలో లభిస్తుంది. దీని కారణంగానే చాలా మంది వాహనదారులు E100 వైపు మెగ్గుచూపుతున్నారు.

మైలేజ్‌లో ట్విస్ట్ ఇదే :
చాలామంది ఇంధనం చౌకగా లభిస్తే కూడా ఖర్చు తగ్గుతుందని భావిస్తుంటారు. ఇథనాల్‌లో పెట్రోల్‌తో పోలిస్తే పవర్ చాలా తక్కువగా ఉంటుంది. దీని కారణంగా E100 వాహనాలు అదే దూరం ప్రయాణించేందుకు ఎక్కువ ఇంధనాన్ని వినియోగించాల్సి ఉంటుంది. దీని కారణంగానే మైలేజ్ తగ్గడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.

కిలోమీటర్‌కు ఎందులో ఖర్చు ఎంత? :
మీరు ఏదైనా పెట్రోల్ కారు ఎంచుకుంటే లీటర్‌కు 20కి.మీ మైలేజ్ ఇస్తుందని అనుకుందాం.. అప్పుడు కిలోమీటర్‌కు ఖర్చు రూ.5.10 ఉంటుంది. అదే E100 వాహనంలో లీటర్ ఇంధనం కొట్టిస్తే 16 కి.మీ మైలేజీ మాత్రమే ఇస్తుంది. దీనికి అయ్యే ఖర్చు రూ.5.31 ఎక్కువ. అయితే, 18 కి.మీ వరకు మైలేజ్ పెరిగితే అప్పుడు దీనికి అయ్యే ఖర్చు కూడా రూ.4.72కు తగ్గుతుంది.

E100 మైలేజ్ తక్కువ ఎందుకంటే? :
వాస్తవానికి, ఇథనాల్‌లో పెట్రోల్ కన్నా సుమారు మూడో వంతు తక్కువ పవర్ ఉంటుంది. అందుకే ఇంజిన్‌కు ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది. తద్వారా మైలేజ్‌ తక్కువ రావడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు.

పెట్రోల్ కన్నా E100 చౌకగా వస్తుందా? :
అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే.. ఇక్కడ ఇంధనం ధరతో పాటు వెహికల్ మైలేజ్ కూడా ముఖ్యమే. వాహనం పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయితే ఈ100 ఇథనాల్ ఖర్చు కూడా తగ్గుతుంది. లేదంటే పెట్రోల్ కన్నా మరింత ఖరీదైనదిగా మారొచ్చు..

ఇథనాల్ E100 బెటరా? పెట్రోల్‌ బెటరా? :
చివరిగా ఒకే మాటలో చెప్పాలంటే.. ఈ100 ఇథనాల్ కన్నా ప్రస్తుతం పెట్రోల్ వాహనాలే బెటర్.. ఎక్కువ మంది వాహనదారులకు సరైన ఆప్షన్ అని చెప్పొచ్చు.. కానీ, ఫ్యూచర్ పరంగా చూస్తే.. ఇథనాలతో నడిచే వాహనాలు ఎక్కువ మైలేజ్ అందిస్తాయి. అందులోనూ తక్కువ ధరతో పొల్యుషన్ కూడా ఉండదు. అందుకే లీటర్ ధర ఎంత ఉంది అనేది కాకుండా కిలోమీటర్‌కు అయ్యే ఖర్చునే చూసి డిసైడ్ అవ్వడం బెటర్..