Redmi K90 Ultra : 8,000mAh బ్యాటరీతో కొత్త రెడ్మి K90 అల్ట్రా వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్!
Redmi K90 Ultra : రెడ్మి K90 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్తో ఈ స్మార్ట్‌ఫోన్ కనీసం 8,000mAh బ్యాటరీ వస్తుందని అంచనా. పూర్తి ఫీచర్లు, ధర వివరాలివే..
Redmi K90 Ultra
- రెడ్మి K90 అల్ట్రా 6.59-అంగుళాల 1.5K ఎల్టీపీఎస్ ఓఎల్ఈడీ డిస్ప్లే
- డ్యూయల్-స్పీకర్ సిస్టమ్, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్
- కనీసం 8,000mAh బ్యాటరీ ఉంటుందని అంచనా
Redmi K90 Ultra : రెడ్మి ఫోన్ కోసం చూసేవారికి సూపర్ గుడ్ న్యూస్.. షావోమీ సబ్-బ్రాండ్ రెడ్మి నుంచి త్వరలో సరికొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. లీక్‌ల ప్రకారం.. రెడ్మి K90 అల్ట్రా స్పెసిఫికేషన్లు రివీల్ అయ్యాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుందని భావిస్తున్నారు. రాబోయే స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నల్ ఫ్యాన్‌తో ఇంటిగ్రేటెడ్ యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కనీసం 8,000mAh బ్యాటరీ ఉంటుందని అంచనా.
రెడ్మి K90 అల్ట్రా ఫోన్ 165Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల 1.5K ఎల్టీపీఎస్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో వస్తుందని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్ ఇటీవలే చైనాలోని 3C సర్టిఫికేషన్ ప్లాట్ఫామ్లో లిస్ట్ అయింది.
రెడ్మి K90 అల్ట్రా ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని అంచనా. సేఫ్టీ కోసం డ్యూయల్-స్పీకర్ సిస్టమ్, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో వస్తుందని భావిస్తున్నారు.
Read Also : Redmi Turbo 5 : గేమర్లకు పండగే.. భారీ బ్యాటరీ, అడ్వాన్స్డ్ కూలింగ్‌తో కొత్త రెడ్మి టర్బో 5 వచ్చేసింది!
ఇటీవలే చైనాలో రెడ్మి K90 మ్యాక్స్ లాంచ్ అయింది. ఈ డ్యూయల్-సిమ్ స్మార్ట్‌ఫోన్ 165Hz రిఫ్రెష్ రేట్, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్ 3,500 నిట్స్ టాప్ బ్రైట్నెస్ అందించే 6.83-అంగుళాల (1,280×2,772 పిక్సెల్స్) M10 డిస్ప్లేతో వస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ఓఎస్ 3పై రన్ అవుతుంది.
రెడ్మి K90 మ్యాక్స్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్లో ఎఫ్/1.68 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో గేమింగ్ కోసం స్పెషల్ D2 గ్రాఫిక్స్ చిప్ ఉంది. థర్మల్ మేనేజ్మెంట్ కోసం 6వేల చదరపు మిల్లీమీటర్ల సర్క్యులేటింగ్ కూలింగ్ పంప్, 12వేల చదరపు మిల్లీమీటర్లకు పైగా గ్రాఫైట్ ఏరియా ఉన్నాయి.
రెడ్మి K90 అల్ట్రాలో 8,550mAh బ్యాటరీ ఉంది. 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి.
