Electric Scooters : రూ. 50వేల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. నెలకు బ్యాటరీకి చెల్లిస్తే చాలు.. తక్కువ ధరకే EV స్కూటర్ ఇంటికి!
Electric Scooters : ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా? రూ. 50వేల లోపు ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. బాస్ బ్యాటరీ ప్లాన్ ద్వారా అతి చౌకైన ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.. ఎలాగంటే?
- Sreehari A
- Published On : March 15, 2026 / 03:10 PM IST
Electric Scooters
- దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఫుల్ డిమాండ్
- రూ. 50వేల లోపు ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు
- బాస్ మోడల్ స్కీమ్ ద్వారా మీ బడ్జెట్ ధరలోనే
Electric Scooters : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు చూస్తున్నారా? ఎలక్ట్రిక్ వాహనాలు భారతీయ మార్కెట్‌ను పూర్తిగా మార్చేశాయి. అద్భుతమైన రేంజ్, హై-టెక్ ఫీచర్లతో మీరు కొత్త స్కూటర్ కొనాలని చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఇప్పటికప్పుడూ రూ. లక్ష ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీకోసం టీవీఎస్, హీరో విడా వంటి ప్రముఖ కంపెనీలు బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్‌ను ప్రవేశపెట్టాయి.
ఈ స్కీమ్ కింద మీరు రూ. 50,000 కన్నా తక్కువ ధరకే ఈవీని సొంతం చేసుకోవచ్చు. ఈ మోడల్‌లో స్కూటర్ బాడీకి మాత్రమే మీరు చెల్లిస్తారు. నెలవారీ అద్దె లేదంటే వినియోగం ఆధారంగా బ్యాటరీకి చెల్లిస్తారు. రూ. 50వేల కన్నా తక్కువ ఉన్న ఈ పవర్‌ఫుల్ స్కూటర్ల ఫీచర్లు, రేంజ్, బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను వివరంగా తెలుసుకుందాం..
BaaS మోడల్ ఏంటి? :
BaaS అనేది కొత్త టెక్నాలజీతో ఎలక్ట్రిక్ స్కూటర్లను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చింది. వాస్తవానికి, బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం ఖర్చులో దాదాపు 40శాతం నుంచి 50శాతం వరకు ఉంటుంది. BaaS మోడల్ కింద కంపెనీలు స్కూటర్ ప్రారంభ ధర నుంచి బ్యాటరీ ధరను లెక్కలో తీసుకోవు.
దాంతో షోరూమ్ ధర భారీగా తగ్గుతుంది. కస్టమర్లు కేవలం నెలవారీ సబ్‌స్క్రిప్షన్ లేదా వినియోగ ఆధారిత రుసుము చెల్లిస్తే సరిపోతుంది. బ్యాటరీ లైఫ్ టైమ్ ఎక్కువ ఉంటుంది. కంపెనీదే బ్యాటరీ బాధ్యత. తీసుకుంటుంది.
హీరో విడా VX2 గో :
హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడా బడ్జెట్ కేటగిరీలో సరసమైన మోడల్ హీరో విడా VX2 గోను BaaS మోడల్‌తో మార్కెట్లో లాంచ్ చేయగా స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 44,990 నుంచి లభిస్తోంది. పర్ఫార్మెన్స్ పరంగా, 2.2kWh రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.
ఫుల్ ఛార్జ్ చేశాక 92 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 70 కి.మీ, ఎకో, రైడ్ వంటి డ్రైవింగ్ మోడ్స్ అందిస్తుంది. విడా VX2 గో కోసం బ్యాటరీ ఛార్జ్ చేస్తే కిలోమీటరుకు సుమారు రూ. 1.25 చెల్లించాలి. 4.3-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, పెద్ద 33.2-లీటర్ బూట్ స్పేస్‌తో వస్తుంది.
టీవీఎస్ ఆర్బిటర్ V1 :
టీవీఎస్ మోటార్ కంపెనీ హై-టెక్ ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఆర్బిటర్ V1ను BaaS స్కీమ్‌తో రిలీజ్ చేసింది. ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 49,999 నుంచి ఉంటుంది. ఈ టీవీఎస్ ఫీచర్ ఏమిటంటే.. స్కూటర్ కొన్నాక కస్టమర్లు బ్యాటరీ కోసం రూ. 862 నెలవారీ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి.
కిలోమీటర్ లిమిట్స్ లేవు. ఈ ప్లాన్ కింద మీరు ఎంతదూరమైన ప్రయాణించవచ్చు. అలాగే టీవీఎస్ 5 ఏళ్లు లేదా 70వేల కిలోమీటర్ల బ్యాటరీ వారంటీని కూడా అందిస్తోంది. ఆర్బిటర్ V1 1.8kWh బ్యాటరీతో 86కి.మీ రేంజ్ అందిస్తుంది. కలర్ LCD డిస్ ప్లే, టర్న్-బై-టర్న్ నావిగేషన్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.
