PF Withdrawal : వావ్.. ఇక UPI, ATM ద్వారా మీ PF డబ్బులు తీసుకోవచ్చు.. కొత్త లిమిట్ ఎంతో తెలుసా?

PF Withdrawal : పీఎఫ్ ఖాతాదారులు తమ ఖాతాలో డబ్బులను తీసుకోవడం చాలా ఈజీ కానుంది. ఈపీఎఫ్ఓ 3.0 కింద పీఎఫ్ ఖాతాలో డబ్బులను ఏటీఎం లేదా యూపీఐ ద్వారా తీసుకోవచ్చు.. ఎంత పరిమితి వరకు తీయొచ్చంటే?

PF Withdrawal

  • అతి త్వరలో ఈపీఎఫ్ఓ (EPFO) 3.0 ప్రారంభం
  • పీఎఫ్ సభ్యులు UPI లేదా ATM ద్వారా వెంటనే ఫండ్స్ విత్‌డ్రా
  • పీఎఫ్ మొత్తంలో 75శాతం వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చు

PF Withdrawal : ఉద్యోగస్తులకు బిగ్ రిలీఫ్.. ఇకపై, పీఎఫ్ ఫండ్స్ ఈజీగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. ఈపీఎఫ్ఓ త్వరలో ‘ఈపీఎఫ్ఓ 3.0’ను ప్రారంభించనుంది. తద్వారా ఉద్యోగులు ఏటీఎం కార్డులు, యూపీఐతో తమ పీఎఫ్ ఖాతాల నుంచి నేరుగా ఫండ్స్ విత్‌డ్రా చేసుకోవచ్చు.

గతంలో ఉద్యోగస్తులకు ప్రావిడెంట్ ఫండ్ (PF) విత్‌డ్రా ప్రాసెస్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అలా ఉండదు. ఇకపై సింపుల్‌గా మీ పీఎఫ్ ఖాతా నుంచి నేరుగా ఏటీఎం లేదా యూపీఐ ద్వారా ఫండ్స్ విత్‌డ్రా చేసుకోవచ్చు.

పీఎఫ్ విత్‌డ్రా ఇక చాలా ఈజీ :
ఈపీఎఫ్ఓ డిజిటలైజ్ ‘EPFO 3.0’లో భాగంగా ఈ అప్‌గ్రేడ్ తీసుకువస్తోంది. పీఎఫ్ ఖాతాదారులకు ఇన్‌స్టంట్ బ్యాంకింగ్ లాంటి సర్వీసులను అందించనుంది. గతంలో, పీఎఫ్ ఫండ్స్ విత్‌డ్రా చేయాలంటే ఆన్‌లైన్ క్లెయిమ్ ఫారం నింపాల్సి వచ్చేది.

అప్రూవల్ కోసం చాలా రోజులు వేచి ఉండాల్సి వచ్చేది. అయితే, కొత్త సిస్టమ్ కింద ఈ మొత్తం ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు తమ ఫండ్స్ కోసం ఇకపై వారాల తరబడి వేచి ఉండాల్సిన పనిలేదు.

Read Also : Simple Ultra EV Scooter : సింపుల్ అల్ట్రా EV స్కూటర్ కిర్రాక్ భయ్యా.. సింగిల్ ఛార్జ్‌తో 400 కి.మీ రేంజ్‌.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఏటీఎం, యూపీఐ ద్వారా ఫండ్స్ విత్‌డ్రా ఎలాగంటే? :
ఈ కొత్త స్కీమ్ ద్వారా మీ పీఎఫ్ ఖాతాను యూపీఐ పేమెంట్ల మాదిరిగా చేయొచ్చు. ఈపీఎఫ్ఓ ఖాతాదారుల కోసం స్పెషల్ పీఎఫ్ ఏటీఎం కార్డు”ను జారీ చేయనుంది. ఆ తర్వాత మీరు ఏదైనా సాధారణ డెబిట్ కార్డు మాదిరిగానే మీ సమీపంలోని ఏటీఎం మెషీన్‌కు వెళ్లి పీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు.

మీ పీఎఫ్ ఖాతాను యూపీఐతో లింకింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈపీఎఫ్ఓ పోర్టల్, ఉమాంగ్ యాప్ ద్వారా బ్యాంకు ఖాతాకు ఫండ్స్ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.

ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా ఎంతంటే? :
ఇకపై పీఎఫ్ డబ్బులను ఎంత మొత్తంలో విత్‌డ్రా చేసుకోవచ్చు అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. అందిన సమాచారం ప్రకారం.. ఏటీఎంలు లేదా యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రాలపై ఈపీఎఫ్ఓ ​​ఒక లిమిట్ విధించనుంది.

ప్రస్తుతం, ఖాతాదారులు ఈ పద్ధతుల ద్వారా మొత్తం ఫండ్స్ నుంచి 50 శాతం లేదా 75 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకోగలరు. అయితే, ప్రారంభ పరిమితి మాత్రమే. భవిష్యత్తులో ఈ పరిమితిని మరింత పెంచే అవకాశం ఉంది. కచ్చితమైన విత్‌డ్రా లిమిట్, ఇతర షరతులకు సంబంధించి ఈపీఎఫ్ఓ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఎప్పటినుంచంటే? :
ఈపీఎఫ్ఓ 3.0 ఏప్రిల్‌లో ప్రారంభమవుతుందని గత నివేదికలు సూచించాయి. కానీ అమలు ప్రస్తుతం ఆలస్యం అవుతోంది. ఈపీఎఫ్ఓ ​​త్వరలో కొత్త మొబైల్ అప్లికేషన్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ కొత్త యాప్ ద్వారా ఖాతాదారులు యూపీఐ ద్వారా ఫండ్స్ ఈజీగా తీసుకోవచ్చు.