EPFO 3.0 Withdrawal Rules : పీఎఫ్ ఖాతాదారులకు పండగే.. EPFO కొత్త రూల్స్.. ఇకపై UPI ద్వారా డబ్బులు తీసుకోవచ్చు.. ఎంతంటే?

EPFO 3.0 Withdrawal Rules : ఈపీఎఫ్ఓ, ఈపీఎఫ్ఓ ​​3.0 కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇకపై యూపీఐ ద్వారా డబ్బు విత్‌డ్రా చేసుకోవడం చాలా ఈజీ. నిత్యావసరాలు, గృహవసతి, ప్రత్యేక అవసరాలు అనే 3 కేటగిరీలతో డబ్బులు తీసుకోవచ్చు. కంపెనీ వాటాతో సహా బ్యాలెన్స్‌లో 75శాతం వరకు ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు.

EPFO 3.0 Withdrawal Rules

  • త్వరలో ఈపీఎఫ్ఓ 3.0 కొత్త విత్ డ్రా రూల్స్ అమల్లోకి
  • యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులను ఎప్పుడైనా తీసుకోవచ్చు
  • కంపెనీ షేర్ సహా బ్యాలెన్స్ లో 75 శాతం వరకు విత్ డ్రా చేయొచ్చు

EPFO 3.0 Withdrawal Rules : పీఎఫ్ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్.. అతి త్వరలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), ఈపీఎఫ్ఓ ​​3.0 ప్రారంభం కానుంది. ఇకపై ఈపీఎఫ్ఓ ఫండ్స్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఈపీఎఫ్ సభ్యులు త్వరలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా తమ ఫండ్స్ విత్ డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో ఎలాంటి డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా ఈపీఎఫ్ఓ ఆఫీసుకు వెళ్లాల్సిన పనిలేదు.

ఈ కొత్త సిస్టమ్ నిబంధనలను ఈజీగా చేసేందుకు డాక్యుమెంట్ల వర్క్ తగ్గించడం, అత్యవసర పరిస్థితులకు ఇల్లు కొనడానికి లేదా రిపేర్లు చేయడం లేదా ఇతర ముఖ్యమైన లైఫ్ సంఘటనల కోసం ఫండ్స్ అవసరమైనప్పుడు సభ్యులకు వారి సేవింగ్స్ వేగంగా పొందడానికి వీలు కల్పిస్తుంది.

ఈపీఎఫ్ఓ 3.0 ఫ్రేమ్‌వర్క్‌పై ప్రభుత్వం అనేక వివరాలను అందించింది. అయితే, నిబంధనలను ఎప్పుడు నోటిఫై చేస్తుందో ఇంకా వెల్లడించలేదు. నిబంధనలు అమలులోకి వచ్చాక ఈపీఎఫ్ సభ్యులు, యూపీఐ ద్వారా తమ ఫండ్స్ విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఈపీఎఫ్ విత్‌డ్రాకు కొత్త రూల్స్ ఏంటి? :
HDFC బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. కొత్త ఈపీఎఫ్ఓ ​​నిబంధనలు ఉద్యోగి, యజమాని వాటాలు రెండింటినీ కలుపుకొని సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్‌లో 100 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇంతకుముందున్న 13 విత్‌డ్రాయల్ నిబంధనలను ఇప్పుడు అత్యవసర అవసరాలు, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు అనే 3 కేటగిరీలుగా విభజించారు. ఈ విత్ డ్రా నిబంధనలు ఈపీఎఫ్ఓ ​​3.0లో భాగం కాదు. ఈపీఎఫ్ సభ్యులు ఇప్పటికీ ఈ విత్ డ్రా సౌకర్యాలను పొందవచ్చు.

అత్యవసర అవసరాల కిందకు ఏవి వస్తాయి? :
అత్యవసర అవసరాలలో అనారోగ్యం, విద్య, వివాహం వంటి ఖర్చులు ఉంటాయి. విద్య కోసం ఇప్పుడు 10 సార్లు, వివాహం కోసం 5 సార్లు వరకు డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. గతంలో ఈ రెండింటికీ కలిపి ఉన్న 3 సార్ల పరిమితితో పోలిస్తే ఎక్కువ ప్రయోజనమనే చెప్పాలి.

Read Also : Google Pay Pocket Money : గూగుల్ పే ‘పాకెట్ మనీ’ ఇదిగో.. ఇకపై ఎవరైనా మీ ఖాతాతో యూపీఐ పేమెంట్లు చేయొచ్చు.. ఎలాగంటే?

గృహ అవసరాల కిందకు ఏవి వస్తాయి? :
ఇల్లు కొనడం, ఇల్లు కట్టడం లేదా తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడం వంటి అవసరాలు గృహ అవసరాల కిందకు వస్తాయి.

ప్రత్యేక పరిస్థితులేంటి? :
ప్రత్యేక పరిస్థితుల కేటగిరీ కింద ప్రకృతి వైపరీత్యాలు లేదా ఊహించని ఆర్థిక ఇబ్బందులు వంటి కేసులు వస్తాయి. ఇప్పుడు 12 నెలల సర్వీసు తర్వాత పాక్షిక విత్ డ్రా చేసుకోవచ్చు. ప్రత్యేక పరిస్థితులలో చేసే విత్ డ్రాలకు అదనపు వివరణ అవసరం లేదు.

ఈపీఎఫ్ విత్‌డ్రా మొత్తం ఎంతంటే? :
గతంలో, ఉద్యోగి వాటా + వడ్డీ (50–100శాతం) మాత్రమే విత్‌డ్రా చేసేందుకు అనుమతి ఉండేది. ఇప్పుడు విత్‌డ్రా చేసుకోగలిగే మొత్తంలో యజమాని వాటా + వడ్డీ కూడా కలిసి ఉంటాయి. అంటే.. ఇప్పుడు ఒక ఈపీఎఫ్ సభ్యుడు అధిక మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.

గరిష్ట ఈపీఎఫ్ విత్‌డ్రా లిమిట్ :
ఇంతకుముందు, ఈపీఎఫ్ విత్‌డ్రాయల్ లిమిట్ ప్రయోజనం ఆధారంగా పరిమితం చేసేవారు. ఇప్పుడు, అర్హత గల మొత్తంలో 75శాతం వరకు ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ వెసులుబాటు అత్యవసర పరిస్థితుల్లో ఈపీఎఫ్ సభ్యులకు సాయపడుతుంది.

నిరుద్యోగ ఈపీఎఫ్ విత్‌డ్రా పరిమితి :
ఇప్పుడు, ఉద్యోగం కోల్పోయిన వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 25 శాతాన్ని 12 నెలల నిరుద్యోగం తర్వాత విత్‌డ్రా చేసుకోవచ్చు. గతంలో పరిమితులతో పాక్షిక విత్‌డ్రాయల్‌కు మాత్రమే అనుమతి ఉండేది.

ఫుల్ ఈపీఎఫ్ విత్ డ్రా షరతులు :
రిటైర్మెంట్ (55 ఏళ్ల వయస్సు), వైకల్యం, జాబ్ కోల్పోవడం, స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) లేదా ఈపీఎఫ్ సభ్యుడు భారత్ శాశ్వతంగా విడిచిపెట్టిన సందర్భాలలో పూర్తి ఈపీఎఫ్ విత్ డ్రా చేసేందుకు అనుమతి ఉంది.

కనీస EPF బ్యాలెన్స్ ప్రొటెక్షన్ :
గతంలో దీనిపై ఎలాంటి ప్రొటెక్షన్ లేదు. ఇప్పుడు, రిటైర్మెంట్ ఫండ్ మానిటరింగ్ కోసం ప్రభుత్వం 25శాతం వాటాను తన వద్దే ఉంచుకోనుంది. లాంగ్ టైమ్ సేవింగ్స్ ఉంచుకునేలా అవకాశాన్ని అందిస్తోంది.

ఈపీఎష్ (పెన్షన్) విత్ డ్రా :
ఇంతకుముందు 2 నెలల తర్వాత పెన్షన్ విత్ డ్రా చేసేందుకు వీలుండేది. ఇప్పుడు 36 నెలల తర్వాత మాత్రమే పెన్షన్ విత్ డ్రా చేయాల్సి ఉంటుంది.