New Credit Card : క్రెడిట్ కార్డుతో నిజంగా అప్పులపాలు అవుతారా? కార్డుతో బెనిఫిట్స్, రిస్క్ ఏంటి? ఎలా వాడాలి? ఫుల్ గైడ్..!
New Credit Card : క్రెడిట్ కార్డుతో ఖర్చు చేయడం అంటే డబ్బు అప్పు తీసుకోవడం లాంటిది. మీరు ముందు ఖర్చు చేసి ఆ తర్వాత బిల్లు చెల్లిస్తారు అంతే.. మీరు ఈజీగా చెల్లించేలా ఖర్చు చేస్తే ఇబ్బంది లేదు.. ఎక్కువ ఖర్చు చేసి కట్టలేకపోతే భారీ వడ్డీలతో అప్పుల పాలవుతారు..
- Sreehari A
- Published On : March 21, 2026 / 06:06 PM IST
New Credit Card
- క్రెడిట్ కార్డు తీసుకుంటే లాభామా? నష్టామా?
- క్రెడిట్ కార్డుతో బెనిఫిట్స్ ఏంటి? రిస్క్ ఏంటి?
- క్రెడిట్ కార్డును అసలు ఎలా వాడాలి? జాగ్రత్తలేంటి?
- ఎలాంటి క్రెడిట్ కార్డు తీసుకోవాలి? ఏం చూడాలి?
New Credit Card : మీకు క్రెడిట్ కార్డు ఉందా? లేదా కొత్త క్రెడిట్ కార్డు తీసుకోవాలని చూస్తున్నారా? క్రెడిట్ కార్డు విషయంలో చాలామందికి అనేక అపోహాలు ఉంటాయి. క్రెడిట్ కార్డు తీసుకుంటే అప్పలపాలవుతారని అంటుంటారు. ఇందులో కొంత నిజం ఉంది..
ఏదైనా సరిగా వాడకపోతే అది సమస్యగానే మారుతుంది. తెలివిగా వాడితే ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే క్రెడిట్ కార్డును తెలివిగా వాడితే నష్టాల కన్నా లాభాలే ఎక్కువగా ఉంటాయి. చాలామంది చేతిలో కార్డు ఉంది కదా అని అవసరం ఉన్నా లేకున్నా తెగ గీకేస్తుంటారు. మీ అవసరం పెద్దది అయితే మాత్రమే క్రెడిట్ కార్డు వాడాలి.
ఎమర్జెనీ సమయాల్లో ఆదుకుంటుంది :
అత్యవసర సమయాల్లో ఎవరిని అడుక్కోకుండా క్రెడిట్ కార్డు మీ అవసరాలను తీరుస్తుంది. అదే కార్డు మీరు తీసుకున్న డబ్బు సకాలంలో కట్టకపోతే అప్పల పాలు చేస్తుంది. మీ అవసరాలకు ఆదుకున్నట్టే మీరు కూడా క్రెడిట్ కార్డు అప్పును గడువు తేదీలోగా కట్టేయాలి. అప్పుడు మీకు క్రెడిట్ కార్డు లిమిట్ పెరుగుతుంది. అలాగే మరెన్నో బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ఏదైనా షాపింగ్ సమయంలో ఈ రివార్డు పాయింట్లు వాడుకోవచ్చు. మీ క్రెడిట్ హిస్టరీ కూడా బాగుంటుంది. సిబిల్ స్కోరు కూడా ఇంప్రూవ్ అవుతుంది. అయితే, క్రెడిట్ కార్డులను వాడే విధానంలో భారీ నష్టాలు కూడా ఉన్నాయి. ఎలా వాడితే నష్టపోతారు? ఎలా వాడితే లాభపడతారు? అనే పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
క్రెడిట్ కార్డు గీకారంటే అప్పు తీసుకున్నట్టే :
క్రెడిట్ కార్డు రాగానే చాలామంది ఆ డబ్బు తమదే అనే భావనలో ఉంటారు. కార్డు మీదే కానీ అందులోని క్రెడిట్ లిమిట్ మీది కాదు.. ఈ విషయం గుర్తుంచుకోవాలి. మీరు బయట ఎవరి దగ్గరైనా ఎలా అప్పుు తీసుకుంటారో అలాగే క్రెడిట్ కార్డు నుంచి మీ డబ్బులు తీస్తే అది అప్పు కిందికే వస్తుంది. మీరు ముందుగా మీ క్రెడిట్ కార్డును గీకి ఖర్చు చేస్తారు. ఆ తర్వాత కొంతకాలానికి బిల్లు చెల్లిస్తారు. కొంతమంది క్రెడిట్ కార్డు గీకేస్తారు కానీ తిరిగి చెల్లించే విషయంలో పెద్దగా పట్టించుకోరు.
ఇలా పదేపదే చేస్తుంటే అప్పుల ఊబిలో కూరుకుపోయే రిస్క్ ఎక్కువగా పెరుగుతుంది. క్రెడిట్ కార్డు వాడిన తర్వాత ఎంత ఖర్చు చేశారో ఆ మొత్తాన్ని డ్యూ డేట్ లోగా చెల్లించాలి. లేదంటే మీరు ఖర్చు చేసిన దానికన్నా రెట్టింపు వడ్డీతో చెల్లించాల్సి వస్తుంది జాగ్రత్త. మినిమం డ్యూ అమౌంట్ జోలికి అసలు వెళ్లొద్దు. కడితే మొత్తం బిల్లు కట్టేయండి. అవసరమైతే తర్వాత మళ్లీ తీసుకోవచ్చు.
క్రెడిట్ కార్డుతో కాదు.. వాడే విధానంతో సమస్య :
చాలామంది క్రెడిట్ కార్డు అనగానే భయపడిపోతుంటారు. క్రెడిట్ కార్డు తీసుకుంటే అప్పులపాలవుతారని ఆందోళన చెందుతారు. క్రెడిట్ కార్డుతో సమస్య కాదని గమనించాలి. మీరు కార్డును ఉపయోగించే విధానంలోనే అసలు సమస్య ఉందని నిపుణులు అంటున్నారు. క్రెడిట్ కార్డును తెలివిగా వాడితే చాలా ప్రయోజనాలు ఉంటాయి.
గత కొన్ని ఏళ్లులో వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా మార్కెట్లో అనేక రకాల క్రెడిట్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. ట్రావెలింగ్ ఎక్కువగా చేసే వారి కోసం ట్రావెల్ క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో ఎక్కువగా షాపింగ్ చేసే వారి కోసం ఇ-కామర్స్ కంపెనీల కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి.
మీ అవసరాలకు తగిన క్రెడిట్ కార్డ్ తీసుకోండి :
క్రెడిట్ కార్డును తీసుకునే ముందు చాలామంది తమ అవసరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. మీ క్రెడిట్ కార్డును కిరాణా సామాగ్రి, ఫ్యూయిల్, ఆన్‌లైన్ షాపింగ్ కోసం వాడాలని అనుకుంటే సింపుల్ క్యాష్‌బ్యాక్ లేదా ఎవ్రీడే రివార్డ్స్ కార్డు తీసుకోవచ్చు. మీరు ఎక్కువగా ట్రావెల్ చేసేవారు అయితే ట్రావెల్ కార్డ్ లేదా హోటల్ బెనిఫిట్స్ కార్డ్ తీసుకోవచ్చు.
లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు బెస్ట్ :
మీకు క్రెడిట్ కార్డు పెద్దగా అవసరం లేదు. అలాంటప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ సమయంలో క్రెడిట్ కార్డు అవసరమని అనుకుంటే లైఫ్ టైమ్ ఫ్రీ కార్డు తీసుకోవడం బెటర్. చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డులను అందిస్తాయి.
మీకు అవసరమైనప్పుడు ఈ క్రెడిట్ కార్డులను వాడుకోవచ్చు అనమాట. ఈ కార్డులతో ఎక్కువ బెనిఫిట్స్ ఉండవు. కానీ, వీటికి ఎలాంటి యానువల్ ఛార్జీలు ఉండవు. క్రెడిట్ కార్డును కేవలం అత్యవసరమైనప్పుడు మాత్రమే వాడేవారికి ఈ క్రెడిట్ కార్డులు చాలా బెస్ట్..
క్రెడిట్ కార్డ్ తీసుకోవాలా? వద్దా? :
క్రెడిట్ కార్డు తీసుకోండి.. కార్డుతో లాభాలేన్ని ఉన్నాయో నష్టాలు కూడా అంతే భారీగా ఉంటాయి. పెట్టుబడి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో అలాగే క్రెడిట్ కార్డు వాడకంలో కూడా అంతే ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. క్రెడిట్ కార్డును వాడేటప్పుడు బిల్లు రాగానే మీరు ఒకటే విషయం గుర్తుంచుకోవాలి.
ఈజీగా చెల్లించే మొత్తాన్ని మీరు ఖర్చు చేస్తున్నారా? లేదా చూడాలి. అప్పుడు మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించే వారికి 52 రోజుల వరకు వడ్డీ లేని క్రెడిట్ లభిస్తుంది. అయితే, బిల్లును పూర్తిగా చెల్లించకపోతే బిల్లు మొత్తంపై వడ్డీ పడుతుంది. ఇలాంటి తప్పు అసలు చేయొద్దు. మినిమం బిల్లు అసలు వద్దు.. ఎప్పుడూ కూడా టోటల్ బిల్లు మొత్తం చెల్లించడం అలవాటు చేసుకోండి.
