Aadhaar Card : కుటుంబంలో ఎవరైనా మరణించారా? ఆధార్ కార్డు వెంటనే డియాక్టివేట్ చేయండి! ఇంటి నుంచే సింపుల్ ప్రాసెస్!

Aadhaar Card : కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించాక వారి ఆధార్‌ను ఎలా డీయాక్టివేట్ చేయాలో తెలుసా? మీ ఇంటి వద్దనే ఉండి ఈ ప్రాసెస్ ఈజీగా పూర్తి చేయొచ్చు. సింపుల్ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Aadhaar Card

  • మరణించిన వ్యక్తి ఆధార్ కార్డు బ్లాక్ చేయడం ఎలా?
  • కుటుంబ సభ్యులు మరణిస్తే వారి ఆధార్ ఏమౌతుంది?
  • ఆధార్ కార్డును ఇంటి దగ్గర నుంచే ఈజీగా డియాక్టివేట్ చేయొచ్చు

Aadhaar Card : ఆధార్ కార్డు అందరికి అవసరమే. ప్రభుత్వ పథకాల దగ్గర నుంచి వ్యక్తిగత అవసరాలకు ప్రతిపనికి ఆధార్ కార్డు అవసరమే. అలాంటి ఆధార్ కార్డు గుర్తింపు కార్డులాంటిది.
పిల్లలను స్కూళ్లలో చేర్పించాలన్నా ఇల్లు లేదా కారు కొనడం, బ్యాంకు లోన్, ప్రభుత్వ పథకాలను పొందాలన్నా లేదా పాస్‌పోర్ట్ ఏంటి.. దాదాపు ప్రతి చిన్న లేదా పెద్ద పనికి ఆధార్ కార్డు ఉండాల్సిందే.

అలాంటి ఆధార్ కార్డుకు సంబంధించి ఒక విషయం (Aadhaar Card) తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణించినప్పుడు చాలా మంది వారి ఆధార్ కార్డును డీయాక్టివేట్ చేయడం మర్చిపోతారు. అలాగే వదిలేస్తారు.

ఈ నిర్లక్ష్యం కొన్ని సమస్యలకు దారితీయొచ్చు. మరణించిన వారి ఆధార్ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేస్తే భారీ మొత్తంలో ఆర్థిక నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ఆధార్ కార్డును వెంటనే డియాక్టివేట్ చేయాలని యూఐడీఏఐ సూచిస్తోంది.

ఎక్స్ వేదికగా UIDAI అలర్ట్ :
ఒకవేళ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించి ఉంటే.. మీరు వారి ఆధార్ కార్డును ఇంకా డీయాక్టివేట్ చేయకపోతే వెంటనే ఆ పని చేయండి. యూఐడీఏఐ కూడా ఈ సమాచారాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. మరణించిన వ్యక్తి ఆధార్ కార్డును మరణానంతరం డీయాక్టివేట్ చేయడం ఎందుకు ముఖ్యం, ఆ పనిని ఇంటి నుంచే ఎలా చేయాలో యూఐడీఏఐ వివరించింది.

కుటుంబ సభ్యుని మరణాన్ని రిపోర్టు చేయడం ద్వారా వారి ఆధార్‌ను డియాక్టివేట్ చేయొచ్చు. తద్వారా వారి ఆధార్ దుర్వినియోగం కాకుండా నివారించవచ్చునని యూఐడీఏఐ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. మై ఆధార్ పోర్టల్ ద్వారా కూడా రిపోర్టు చేయొచ్చునని సూచించింది.

ఇంట్లో కూర్చునే ఆధార్ డియాక్టివేట్ చేయొచ్చు :
కుటుంబ సభ్యుని మరణాన్ని రిపోర్టు చేయడం తప్పనిసరి. మరణించిన కుటుంబ సభ్యుని ఆధార్‌ను డియాక్టివేట్ చేయడం ద్వారా దుర్వినియోగం కాకుండా నివారించవచ్చు. ఇదే విషయాన్ని యూఐడీఏఐ కూడా వెల్లడించింది. ఈ మొత్తం ప్రాసెస్ డిజిటల్ గానే ఉంటుంది.

Read Also : SIP Calculator : సామాన్యుడు కూడా కోటీశ్వరుడు అవ్వొచ్చు! SIPలో నెలకు ఇలా పెట్టుబడి పెట్టండి చాలు.. పూర్తి లెక్కలివే..!

మీ ఇంటి నుంచే ఈజీగా పూర్తి చేయవచ్చు. ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా మరణించిన వ్యక్తి డెత్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. అది కూడా సాఫ్ట్ కాపీ బెస్ట్.

ఫుల్ ప్రాసెస్ ఇలా :
మీ ఆధార్ కార్డు నంబర్‌తో లాగిన్ అవ్వండి. మీ కుటుంబ సభ్యుని ఆధార్‌ను డియాక్టివేట్ చేయవచ్చు. ఈ ప్రాసెస్ ముందు మీకు మరణించిన వ్యక్తి డెత్ సర్టిఫికేట్ అవసరం. మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ నుంచి ప్రాసెస్ చేస్తున్నా అప్‌లోడ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. డెత్ సర్టిఫికేట్ సాఫ్ట్ కాపీని సిస్టమ్‌లో ముందుగానే ఉంచుకుంటే ఇంకా బెటర్.

1. మీరు మై ఆధార్ పోర్టల్ (myaadhaar.uidai.gov.in)కు వెళ్లండి.
2. మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
3. మీకు అనేక ఆప్షన్లు కనిపిస్తాయి. (Report Death of a Family Member)పై క్లిక్ చేయండి.
4. ఇప్పుడు ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీరు అవసరమైన వివరాలను నింపాలి.
5. డెత్ సర్టిఫికేట్ జారీ అయిన రాష్ట్రం, మృతుని ఆధార్ నంబర్, మరణ నమోదు సంఖ్య, మృతుని పేరు, డెత్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాలి. ఇతర అవసరమైన సమాచారంతో పాటు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
6. మొత్తం డేటాను ఎంటర్ చేశాక సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయండి. పైవిధంగా మీరు మరణించిన వ్యక్తి ఆధార్‌ను డియాక్టివేట్ చేయవచ్చు.