Flipkart Big Billion Days Sale 2026 : వారెవ్వా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మోటోరోలా ఫోన్లపై స్పెషల్ డీల్స్.. ఏ ఫోన్ ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఆగలేరు!
Flipkart Big Billion Days Sale 2026 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026లో 7 మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లపై ప్రత్యేక డీల్స్ అందిస్తోంది. మోటో G06 పవర్ రూ. 13,999 నుంచి ప్రారంభమవుతుంది.
- Sreehari A
- Published on- September 28, 2026 / 08:27 PM IST
Flipkart Big Billion Days Sale 2026
- 7 మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లపై బిగ్ బిలియన్ డేస్ డీల్స్
- మోటో G06 పవర్ ధర రూ. 13,999 నుంచి ప్రారంభం
- 7,100mAh వరకు బ్యాటరీ, 144Hz డిస్‌ప్లే ఫోన్లు
Flipkart Big Billion Days Sale 2026 : మోటోరోలా ఫ్యాన్స్ పండగ చేస్కోండి.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 సందర్భంగా మోటరోలా ఫోన్లపై స్పెషల్ డీల్స్‌ను ప్రకటించింది. కంపెనీ బిగ్ బిలియన్ మోటో డీల్స్ కింద మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్, ఎడ్జ్ 70 ప్రో, ఎడ్జ్ 70 ప్రో ప్లస్, మోటో జీ37 పవర్, మోటోరోలా సిగ్నేచర్, మోటో జీ06 పవర్ ఎడ్జ్ 70 మ్యాక్స్ వంటి ఫోన్‌లు వేర్వేరు ధరల్లో అందుబాటులో ఉన్నాయి.
ఈ ఫోన్‌లలో 7,000mAh వరకు భారీ బ్యాటరీ, 144Hz వరకు డిస్‌ప్లే, 50MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ లేదా మీడియాటెక్ చిప్‌సెట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కొన్ని మోడళ్ల సేల్స్ ఇప్పటికే ప్రారంభం కాగా, మిగిలిన ఫోన్‌లకు అక్టోబర్ 8 నుంచి ఎర్లీ యాక్సెస్ అందుబాటులో ఉంటుంది.
మోటోరోలా ఫోన్లపై అద్భుతమైన డీల్స్ :
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ ధర రూ. 29,999 నుంచి ప్రారంభమవుతుంది. 8GB + 128GB మోడల్ ధర రూ. 29,999, 12GB + 256GB ధర రూ. 32,999, 12GB + 512GB వేరియంట్ ధర రూ. 34,999కు లభిస్తుంది. ఈ ఫోన్‌లో 1.5K క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే ఉంది.
120Hz రిఫ్రెష్ రేట్ 4,500 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 చిప్‌సెట్ 7,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో రన్ అవుతుంది. 68W టర్బోపవర్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్‌లో 50MP సోనీ LYTIA 710 మెయిన్ కెమెరా, 13MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి.
Read Also : Lava Virat Curve 5G : పండగ చేస్కోండి.. లావా విరాట్ కర్వ్ 5G ఫస్ట్ సేల్.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!
మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ఫోన్ 8GB + 256GB వేరియంట్ ధర రూ. 36,999 కాగా, 12GB + 256GB మోడల్ ధర రూ. 39,999 ఉంటుంది. 6.8-అంగుళాల 1.5K 144Hz డిస్‌ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 8500 ఎక్స్ ట్రీమ్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
మరోవైపు మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ 12GB + 256GB మోడల్ రూ. 44,999 ధరకు అందుబాటులో ఉంది. ఇందులో డైమెన్సిటీ 8500 ఎక్స్‌ట్రీమ్ చిప్‌సెట్ 6.8-అంగుళాల 1.5K 144Hz డిస్‌ప్లే కూడా ఉన్నాయి. ముఖ్యంగా, ఈ ఫోన్‌లో 50MP 3.5x పెరిస్కోప్ కెమెరా, 6,500mAh బ్యాటరీ, 90W వైర్డ్ 15W వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి.
మోటో జీ37 పవర్ ధర జస్ట్ ఎంతంటే? :
బడ్జెట్‌లో భారీ బ్యాటరీ ఉన్న ఫోన్ కోసం చూస్తున్న వారికి మోటో జీ37 పవర్ ధర రూ. 16,999 నుంచి ప్రారంభమవుతుంది. 4GB + 64GB మోడల్ ధర రూ. 16,999, 4GB + 128GB మోడల్ ధర రూ. 18,999, 8GB + 128GB మోడల్ ధర రూ. 24,999 ఉంటుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్, 7,000mAh బ్యాటరీ, 33W టర్బోపవర్ ఛార్జింగ్ ఉన్నాయి. ఇందులో 6.7-అంగుళాల 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, IP64 రేటింగ్ ఉన్నాయి.
మోటోరోలా ప్రీమియం సిగ్నేచర్ స్మార్ట్‌ఫోన్ కూడా ఈ సేల్‌లో అందుబాటులో ఉంది. 12GB + 256GB మోడల్ ధర రూ. 57,499 కాగా, 16GB + 512GB మోడల్ ధర రూ. 62,499గా ఉంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్, 1.5K 165Hz ఎక్స్‌ట్రీమ్ అమోల్డ్ ఎల్టీపీఓ డిస్‌ప్లే, ట్రిపుల్ 50MP కెమెరా సెటప్ ఉన్నాయి. 8K డాల్బీ విజన్ రికార్డింగ్ 100x సూపర్ జూమ్ ప్రో వంటి ఫీచర్లు కూడా అందిస్తుంది.
మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ ఫోన్ 8GB + 256GB మోడల్ ధర రూ. 51,999 కాగా, 12GB + 256GB మోడల్ ధర రూ. 56,999గా ఉంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్, క్వాడ్ HD+ డిస్‌ప్లే, 7,100mAh బ్యాటరీ ఉన్నాయి. మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. మరోవైపు, మోటో G06 పవర్ ఫోన్ కూడా రూ. 13,999 ధరకు అందుబాటులో ఉంది. ఇందులో 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, మీడియాటెక్ హెలియో జీ81 చిప్‌సెట్, IP64 రేటింగ్ ఉన్నాయి.
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్, ఎడ్జ్ 70 ప్రో, ఎడ్జ్ 70 ప్రో ప్లస్, మోటో జీ37 పవర్ వంటి మోడళ్లు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026లో ఇప్పటికే అమ్మకానికి ఉన్నాయి. నివేదికల ప్రకారం.. మిగిలిన మోడళ్లకు ఎర్లీ యాక్సెస్ అక్టోబర్ 8 నుంచి అందుబాటులో ఉంటుంది. కాగా, బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 9న ప్రారంభం కానుంది. ధరలలో బ్యాంక్, ప్రీపెయిడ్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ఉండవచ్చు. స్టాక్స్, ఆఫర్లు ఉన్నంత వరకు అందుబాటులో ఉంటాయి.
