Flipkart Sale : ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ ధమాకా.. 55 అంగుళాల శాంసంగ్ మినీ LED 4K TV కేవలం రూ.40 వేలకే..!
Flipkart Sale : ఫ్లిప్‌కార్ట్ సాసా లేలే సేల్ సందర్భంగా శాంసంగ్ 55-అంగుళాల మినీ ఎల్ఈడీ 4K స్మార్ట్ టీవీ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఎస్బీఐ బ్యాంక్ కార్డ్ ఆఫర్‌తో ధర ఇప్పుడు రూ. 40,999గా ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
- Sreehari A
- Updated on- May 8, 2026 / 03:06 PM IST
Flipkart Sale
- ఎస్‌బీఐ బ్యాంక్ ఆఫర్ తర్వాత స్మార్ట్ టీవీ ధర రూ. 40,999
- శాంసంగ్ టీవీలో 4K మినీ ఎల్ఈడీ డిస్‌ప్లే HDR10+ సపోర్ట్
- ప్లస్, బ్లాక్ యూజర్ల కోసం ఫ్లిప్‌కార్ట్ సాసా లేలే సేల్ ప్రారంభం
Flipkart Sale : కొత్త స్మార్ట్‌టీవీ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇది మీకోసమే. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ యూజర్ల కోసం ‘సాసా లెలే సేల్’ ప్రారంభమైంది. ఈ సేల్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌టీవీలు సహా ఇతర హోం అప్లియన్సెస్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
శాంసంగ్ 55-అంగుళాల మినీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ కూడా భారీ ధర తగ్గింపుతో లభిస్తోంది. ఈ టీవీ 55-అంగుళాల వేరియంట్ రూ. 45,000 కన్నా తక్కువ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ కొనుగోలుకు ఎస్‌బీఐ బ్యాంక్ కార్డ్ ఉండాలి.
ప్లస్, బ్లాక్ మెంబర్లకు మాత్రమే ఆఫర్ :
శాంసంగ్ విజన్ ఏఐ టీవీ 55-అంగుళాల 4K స్మార్ట్ మినీ ఎల్ఈడీ టీవీ (UA55M2EHAULXL)పై ఈ ఆఫర్ ప్రస్తుతం ప్లస్, బ్లాక్ మెంబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇతర యూజర్లందరికి ఈ సేల్ ఈరోజు రాత్రి 12 గంటలకు మే 9న ప్రారంభమవుతుంది.
డైరెక్ట్ డిస్కౌంట్‌తో పాటు ఈ టీవీ ఎస్బీఐ బ్యాంక్ కార్డులతో రూ.4 వేల వరకు అదనపు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తుంది. తద్వారా ఈ డీల్ ధర రూ. 40,999 అవుతుంది. ఫ్లిప్‌కార్ట్ సాసా లేలే సేల్ సమయంలో ఈఎంఐ లావాదేవీలపై కూడా ఈ బ్యాంక్ ఆఫర్ వర్తిస్తుంది.
Read Also : Yamaha Prices Hike : బిగ్ షాక్.. ఇక స్కూటర్ కొనడం కష్టమేనా..? భారీగా పెరిగిన యమహా స్కూటర్ల ధరలు
విజన్ ఏఐ ఫీచర్లు హైలెట్ :
ఈ 55-అంగుళాల శాంసంగ్ స్మార్ట్ టీవీలో (3840×2160) పిక్సెల్ రిజల్యూషన్‌తో 4K అల్ట్రా HD మినీ ఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఈ టీవీలోని మినీ ఎల్ఈడీ ప్రాసెసర్ 4కే, HDR10+కు సపోర్ట్ చేస్తుంది. మోషన్ ఎక్సెలరేటర్, కాంట్రాస్ట్ ఎన్‌హాన్సర్, 4K అప్‌స్కేలింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. కంపెనీ ప్రకారం.. కంటెంట్ పిక్చర్ క్వాలిటీ కోసం విజన్ ఏఐ ఫీచర్లను కూడా అందిస్తుంది.
ఈ స్మార్ట్ టీవీ శాంసంగ్ టైజెన్ ఓఎస్‌పై రన్ అవుతుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి ఓటీటీ యాప్‌లకు సపోర్టు ఇస్తుంది. ఈ టీవీలో యాపిల్ ఎయిర్‌ప్లే, స్క్రీన్ మిర్రరింగ్, బ్లూటూత్ వై-ఫై కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. గేమింగ్ కోసం ఇందులో ALLM, VRR ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఆడియో విషయానికి వస్తే.. శాంసంగ్ విజన్ ఏఐ M2EH టీవీలో OTS లైట్‌తో ఇంటర్నల్ స్పీకర్ సెటప్ ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 3 HDMI పోర్ట్‌లు, ఒక USB పోర్ట్, ఈథర్నెట్ సపోర్ట్ ఉన్నాయి.
