Flipkart Food Delivery : ఫుడ్ ప్రియులకు పండగే.. జొమాటో, స్విగ్గీలకు చెక్.. ఇక ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు..!
Flipkart Food Delivery : ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్లో జొమాటో, స్విగ్గీల ఆధిపత్యానికి ఫ్లిప్‌కార్ట్ అతి త్వరలో చెక్ పెట్టేందుకు రెడీ అవుతోంది. ఈ కంపెనీ ముందుగా పరిమిత స్థాయిలో ONDC ఇంటిగ్రేషన్‌తో టెస్టింగ్ ప్రారంభించనుంది. కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా విస్తరించనుంది.
- Sreehari A
- Updated on- July 24, 2026 / 02:23 PM IST
Flipkart Food Delivery ( Image Credit : AI )
- స్విగ్గీ, జొమాటోలకు పోటీగా రంగంలోకి ఫ్లిప్‌కార్ట్
- ONDC భాగస్వామ్యంలో ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీ సర్వీసు
- కంపెనీ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి వెల్లడి
Flipkart Food Delivery : ఫుడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ అనగానే అందరికి జొమాటో, స్విగ్గీ గుర్తుకువస్తాయి.. ఇక నుంచి ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా ఫుడ్ డెలివరీ చేయబోతోంది. అతి త్వరలోనే ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇదే విషయాన్ని కంపెనీ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి స్వయంగా చెప్పారు.
ప్రస్తుతం ఫుడ్ డెలివరీ మార్కెట్లో జొమాటో, స్విగ్గీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇప్పుడు వీటికి పోటీగా ఫ్లిప్‌కార్ట్ కూడా రంగంలోకి దిగేందుకు రెడీ అవుతోంది. రాబోయే రోజుల్లో జొమాటో, స్విగ్గీలకు, ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.
ప్రారంభంలో లిమిటెడ్ సర్వీసు :
ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కళ్యాణ్ కృష్ణమూర్తి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మేం రాబోయే కొద్ది వారాల్లో ఫుడ్ డెలివరీని ప్రారంభిస్తాం. వినియోగదారులు ఎలా రెస్పాండ్ అవుతారో పరీక్షిస్తాం. వారి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాం. వినియోగదారులకు నిజంగా నచ్చేంత వరకు ప్రొడక్టులను మెరుగుపరుస్తూనే ఉంటాం. ఆ తర్వాత, మేం విడతలవారీగా మార్కెట్ విస్తరిస్తాం’అని తెలిపారు.
Read Also : ITR Deadline : ITR డెడ్‌లైన్‌పై డౌట్ క్లియర్! జూలై 31నా? ఆగస్టు 31నా? మీ ఆదాయం బట్టి మీ గడువు ఇదే!
అయితే, ప్రారంభంలో పరిమితంగానే సర్వీసులను ప్రారంభిస్తామన్నారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున సర్వీసులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే క్విక్ కామర్స్ ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ మాదిరి వ్యూహాన్నే అమలు చేయాలని చూస్తోంది.
అంటే.. దీనికి ఒక స్పెషల్ యాప్ తీసుకురానుంది. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లోనే ఇది కూడా ఉంటుంది. ప్రస్తుతానికి బ్రాండింగ్ లేదా ప్రారంభించే సిటీ వంటి వివరాలను కంపెనీ సీఈఓ కృష్ణమూర్తి వెల్లడించలేదు.
ONDCతో ఇంటిగ్రేషన్ :
సంబంధిత సమాచారం ప్రకారం.. ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC)తో భాగస్వామ్యంలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీ సర్వీసును ప్రారంభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీ సేవలను ఎలా అందుబాటులోకి తీసుకువస్తారు అనేదానిపై కృష్ణమూర్తి రివీల్ చేయలేదు. భారత ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో ఫ్లిప్‌కార్ట్ కూడా తనకంటూ స్థానాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది.
రాపిడో ఓన్లీ ప్లాట్‌ఫామ్ :
రైడ్-హెయిలింగ్ స్టార్టప్ రాపిడో కూడా ఇటీవలే సొంత ప్లాట్‌ఫామ్ ఓన్లీని ప్రవేశపెట్టింది. కొత్త కస్టమర్ల కోసం పోటీ పడకుండా ఇప్పటికే ఉన్న కస్టమర్ల కోసమే సరసమైన ధరలు, రెస్టారెంట్లపై జీరో కమీషన్లతో లక్షలాది మంది కొత్త యూజర్లను ఆకర్షిస్తోంది. అలాగే, ఫుడ్ డెలివరీ వినియోగదారులను లక్ష్యంగా స్విగ్గీ ‘టాయింగ్’ అనే కొత్త యాప్‌ను కూడా కూడా స్విగ్గీ తీసుకువచ్చింది.
