పెట్రో మంటలు : పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

  • Publish Date - January 15, 2019 / 04:21 AM IST

వాహనదారులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. పెట్రో ధరలు మంటలు పుట్టిస్తున్నాయి. కొంతకాలం తగ్గుతూ వచ్చిన ఇంధన ధరలు.. మళ్లీ షాక్ ఇస్తున్నాయి. వరుసగా 6వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 70 రూపాయల మార్క్‌ను దాటింది. 2019, జనవరి 15వ తేదీ మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర 28 పైసలు, లీటరు డీజిల్ ధర 29 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ.70.41కి చేరితే.. డీజిల్ ధర రూ.64.47 వద్ద కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రూ.76.05 వద్ద ఉండగా, డీజిల్ ధర రూ.75.77 వద్ద కొనసాగుతోంది. హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధర రూ.74.40 వద్ద ఉండగా.. డీజిల్ ధర రూ.69.77 వద్ద కొనసాగుతోంది. అమరావతిలో పెట్రోల్‌ రూ.74.20 వద్ద, డీజిల్‌ రూ.69.23 వద్ద కొనసాగుతున్నాయి. చెన్నై, కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.73.08 వద్ద ఉండగా.. ఢీజిల్ ధర రూ.72.52కి చేరింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌‌కు 60.29 డాలర్ల వద్ద.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 51.43 డాలర్ల వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గినా దేశీయంగా ఇంధన ధరలు పెరగడం విచిత్రం. 2019లో జనవరిలో 15రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలు 6 సార్లు పెరిగాయి.