Ultra Premium Gated Community : ఒక్కో ప్లాట్ ధర రూ.6 కోట్ల నుంచి రూ.30 కోట్లు.. అయినా తగ్గేదేలే అంటున్న జనం, అల్ట్రా ప్రీమియం అపార్ట్‌మెంట్స్‌కు ఎందుకంత క్రేజ్ అంటే..

మొన్న ఎకరం 100 కోట్లు పలికిన కోకాపేటలో అధికంగా ఈ తరహా అపార్ట్ మెంట్స్ నిర్మిస్తున్నారు. Ultra Premium Gated Community

Ultra Premium Gated Community

Ultra Premium Gated Community Flats : ఒకప్పుడు అపార్ట్ మెంట్స్. తర్వాత గేటెడ్ కమ్యూనిటీలు. ఆ తర్వాత ప్రీమియం గేటెడ్. మరిప్పుడు అల్ట్రా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలు. హైదరాబాద్ నిర్మాణ రంగంలో రోజురోజుకు ట్రెండ్ మారుతోంది. ప్రస్తుతం గ్రేటర్ సిటీలో అల్ట్రా గేటెడ్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం జోరుగా సాగుతోంది. కొనుగోలుదారుల డిమాండ్ కు తగ్గట్టుగా కనీవినీ ఎరుగని లగ్జరీ సౌకర్యాలతో వీటిని నిర్మిస్తున్నారు బిల్డర్లు.

హైదరాబాద్ లో అల్ట్రా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీల ట్రెండ్ నడుస్తోంది. 5వేల నుంచి 15వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్లాట్స్ నిర్మాణం ఉంటుంది. అదిరిపోయే సౌకర్యాలతో అల్ట్రా ప్రీమియం అపార్ట్ మెంట్స్ నిర్మాణం చేపడుతున్నారు. వీటిలో ఒక్కో ప్లాట్ ధర రూ.6 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు ఉంటుంది.

20ఏళ్ల క్రితం అపార్ట్ మెంట్స్ అంటే ఆశ్చర్యంతో చూసిన వారు ఉన్నారు. క్రమక్రమంగా అపార్ట్ మెంట్స్ స్థానంలో గేటెడ్ కమ్యూనిటీలు వచ్చేశాయి. హైదరాబాద్ లో ఒక్కో గేటెడ్ కమ్యూనిటీలో వెయ్యి ప్లాట్లు మొదలు 3వేల వరకు ప్లాట్స్ వరకు ఉంటున్నాయి. అయితే, అంతకుమించి కావాలి అంటున్నారు భాగ్యనగర వాసులు. ఇంటి కొనుగోలుదారుల అభిరుచికి తగ్గట్టు హైదరాబాద్ లో అల్ట్రా ప్రీమియం కమ్యూనిటీల ట్రెండ్ మొదలైంది.(Ultra Premium Gated Community)

Also Read..Home Construction : ఇలా చేస్తే.. ఇంటి నిర్మాణ ఖర్చులు భారీగా తగ్గించుకోవచ్చు..!

ప్రధానంగా హైదరాబాద్ వెస్ట్ లోని ఐటీ హబ్ పరిసర ప్రాంతాల్లో అల్ట్రా ప్రీమియం ప్రాజెక్టులను భారీగా నిర్మిస్తున్నారు. 20వరకు అల్ట్రా ప్రీమియం ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. అల్ట్రా ప్రీమియం ప్లాట్స్ ఒక్కోటి కనీసం 5వేల చదరపు అడుగుల విస్తీర్ణం నుంచి నిర్మిస్తున్నారు. ఆ తర్వాత 10వేల నుంచి 15వేల చదరపు అడుగుల విస్తీర్ణం వరకు ఉంటున్నాయి. మొన్న ఎకరం 100 కోట్లు పలికిన కోకాపేటలో అధికంగా ఈ తరహా అపార్ట్ మెంట్స్ నిర్మిస్తున్నారు.

కోకాపేటతో పాటు ఐడీ కారిడార్ లోని నార్సింగ్, గండిపేట్, నానక్ రాంగూడలో సైతం అల్ట్రా ప్రీమియం అపార్ట్ మెంట్స్ నిర్మాణాలను చేపట్టాయి పేరున్న నిర్మాణ సంస్థలు. ఇప్పటికే 2వేల నుంచి 3వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని అపార్ట్ మెంట్స్ లో నివాసం ఉంటున్న వారు కుటుంబ అవసరాల కోసం మరింత విలాసవంతమైన ఇళ్లవైపు చూస్తున్నారు. ఇప్పటివరకు ఇలాంటి వారంతా విల్లాల వైపు మొగ్గు చూపేవారు. అయితే, విల్లా అనేసరికి నగరానికి కాస్త దూరం వెళ్లాల్సి వస్తుండటంతో సిటీలోనే విల్లా సదుపాయాలు ఉండే అల్ట్రా ప్రీమియం అపార్ట్ మెంట్స్ వైపు మొగ్గుచూపుతున్నారు.

ఇక హైదరాబాద్ లో అల్ట్రా ప్రీమియం అపార్ట్ మెంట్స్ ధరలు విల్లాలను మించి ఉంటున్నాయి. అల్ట్రా ప్రీమియం ప్రాజెక్టుల్లో చదరపు అడుగు 12వేల రూపాయల నుంచి మొదలు గరిష్టంగా 20వేల రూపాయల వరకు ఉంటున్నాయి. అంటే 5వేల చదరపు అడుగుల విస్తీర్ణణంలో ఉన్న ప్లాట్ ధర రూ.6కోట్ల నుండి రూ.10 కోట్ల అన్న మాట. అదే 15వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న అపార్ట్ మెంట్ లోని ప్లాట్ ధర ఏకంగా రూ.18 కోట్ల నుండి రూ.30 కోట్ల వరకు ఉంది. ఇలా అల్ట్రా ప్రీమియం అపార్ట్ మెంట్స్ ను వ్యాపారులు, ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్ రంగంలోని ఉన్నత ఉద్యోగులు, వైద్యులు, సినీ రంగ ప్రముఖులు, ఎన్ఆర్ఐలు, రాజకీయ నాయకులు కొనుగోలు చేస్తున్నారని నిర్మాణదారులు చెబుతున్నారు.

Also Read..5 Best Laptop Deals : ఫ్లిప్‌కార్ట్‌లో 5 బెస్ట్ ల్యాప్‌టాప్ డీల్స్.. 37శాతం డిస్కౌంట్.. ఏ ల్యాప్‌టాప్ తక్కువ ధర ఉందంటే?

ఇక అల్ట్రా ప్రీమియం అపార్ట్ మెంట్స్ లో కొందరు విశాలమైన నివాసంలో ఉండేందుకు కొనుగోలు చేస్తూ ఉండగా, మరికొందరు పెట్టుబడి కోణంలో కొంటున్నారని రియాల్టీ వర్గాలు చెబుతున్నారు. భద్రత, గ్రీనరీ, లగ్జరీ సౌకర్యాలు, వైద్య సదుపాయాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు మరెన్నో అంశాలను దృష్టిలో పెట్టుకుని అల్ట్రా ప్రీమియం అపార్ట్ మెంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు కొనుగోలుదారులు. అంతేకాదు ఇలాంటి అపార్ట్ మెంట్స్ లో నివాసం ఉండటం సొసైటీలో ప్రెస్టీజియస్ గా భావిస్తున్నారు చాలామంది.

ఐటీ కారిడార్ లోని ప్రాజెక్టులైతే అద్దెలు సైతం భారీగా వస్తుండటంతో ఐటీ సంస్థలు సైతం భారీ అవసరాలరీత్యా ప్లాట్లను బుక్ చేస్తున్నాయి. వీటికి మార్కెట్ లో డిమాండ్ ఉండటంతో బడా నిర్మాణ సంస్థలు అల్ట్రా ప్రీమియం అపార్ట్ మెంట్స్ నిర్మించేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. సుమారు 40 నుంచి అత్యధికంగా 58 అంతస్తుల వరకు ఆ అపార్ట్ మెంట్స్ అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ తో డిజైన్ చేసి మరీ నిర్మిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు