Gold Rate Today : గోల్డ్ రేట్లు రివర్స్.. మళ్లీ పైకి.. ఈ రోజు బంగారం, వెండి ధరలు.. సిటీల వారీగా..
Gold Rate Today : గత వారం రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు బుధవారం మళ్లీ పెరిగాయి.
- Harishth Thanniru
- Published On : March 25, 2026 / 10:40 AM IST
Gold Rate Today : పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తొంది. స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. అయితే, బంగారం, వెండి ధరల్లో కూడా భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత వారం రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చిన గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవాళ మళ్లీ భారీగా పెరిగాయి.
బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. గోల్డ్, సిల్వర్ రేట్లు బుధవారం భారీగా పెరిగాయి. గత వారం రోజుల్లో 10గ్రాముల బంగారం ధర రూ.15వేలకుపైగానే తగ్గింది. అయితే, బుధవారం మళ్లీ ధర పెరిగి బంగారం కొనుగోలుదారులకు షాకిచ్చింది.
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 3,760 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 3,450 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు బంగారంపై 99 డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,572 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
వెండి ధరసైతం భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ.10వేలు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,47,670కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,34,450 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,46,820 వద్దకు చేరగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,34,600 వద్దకు చేరుకుంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,46,670కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,34,450 వద్దకు చేరింది.
వెండి ధర ఇవాళ పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,60,000 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,50,000వద్ద కొనసాగుతుండగా.. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,60,000 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
