Gold: ఆహా.. ఇదికదా కావాల్సింది..! ఇవాళ భారీగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ రేటు ఎంతో తెలుసా..
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై ..
- Harishth Thanniru
- Published On : August 11, 2025 / 09:58 AM IST
Gold Rates
Today Gold Rate: బంగారం కొనుగోలుదారులకు భారీ ఊరట లభించింది. గడిచిన మూడు రోజులుగా గోల్డ్ రేటు దిగొస్తోంది. తాజాగా.. సోమవారం కూడా బంగారం ధర భారీగా తగ్గింది.
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ.760 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 700 తగ్గింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 22 డాలర్లు తగ్గింది. ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 3,378 డాలర్ల వద్ద కొనసాగుతుంది. ఇదిలాఉంటే.. వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.93,750 చేరగా.. 24 క్యారట్ల ధర రూ.1,02,280కి చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,900కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ. 1,02,430కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.93,750 కాగా.. 24క్యారెట్ల ధర రూ.రూ.1,02,280కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,27,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,17,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,27,00 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
