Gold Rate: భోగి పండగ వేళ మహిళలకు బిగ్ షాక్.. ఇవాళ్టి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం బంగారం ధర భారీగా పెరిగింది. విజయవాడ, విశాఖపట్టణం, హైదరాబాద్ నగరాల్లో పది గ్రాములు 24 క్యారట్ల బంగారం ధర..
- Harishth Thanniru
- Published On : January 13, 2025 / 11:21 AM IST
Gold
Gold And Silver Price Today: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ భోగి పండుగను ప్రజలు వైభవంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే భోగి మంటలు వేశారు. పిల్లలు, పెద్దలు, మహిళలు భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఆడుతూపాడుతూ సందడి చేశారు. ఇదిలాఉంటే.. సంక్రాంతి పర్వదినం సందర్భంగా బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమైన వారికి బిగ్ షాక్ తగిలిగింది. సోమవారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 430 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 400 పెరిగింది. మరోవైపు వెండి ధరసైతం భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరల వివరాలు తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం బంగారం ధర భారీగా పెరిగింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో..
22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,400.
10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.80,070
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
ఢిల్లీ: 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,550
24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 80,220.
ముంబయి కోల్ కతా, బెంగళూరు నగరాల్లో :
22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.73,400.
24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.80,070
చెన్నై: 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 73,400.
24 క్యారట్ల గోల్డ్ రేటు రూ. 80,070.
వెండి ధర ఇలా ..
దేశవ్యాప్తంగా ఆదివారం వెండి ధర భారీగా పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.1,02,000 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నై: కిలో వెండి ధర రూ. 1,02,000.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో: కిలో వెండి ధర రూ. 93,600.
బెంగళూరు : కిలో వెండి ధర రూ. 93,600 వద్ద కొనసాగుతుంది.
పైనపేర్కొన్న బంగారం, వెండి ధరలు ఇవాళ ఉదయం నమోదైనవి. ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
