Gold Rate: బంగారం ధరల దూకుడుకు బ్రేక్.. రెండోరోజూ తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ రేటు ఎంతంటే?
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల్లో ఇవాళ కీలక మార్పులు చోటు చేసుకున్నాయి...
- Harishth Thanniru
- Published On : March 17, 2025 / 10:37 AM IST
Gold
Gold and Silver Price: బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. తద్వారా ఆల్ టైం రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఇటీవల 10గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.90వేలకు చేరింది. అయితే, రెండు రోజులుగా బంగారం ధరల దూకుడుకు బ్రేక్ పడింది. శనివారం బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పుచోటుచేసుకోలేదు. ఇవాళ స్వల్పంగా తగ్గాయి.
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల 24 క్యారట్ల బంగారం పై రూ. 110 తగ్గింది. మరోవైపు కిలో వెండిపై రూ. 100 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు 2,983 డాలర్ల వద్ద కొనసాగుతుంది. అయితే, దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడలో ఇవాళ్టి బంగారం, వెండి ధరల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.82,100 కాగా.. 24 క్యారట్ల ధర రూ.89,560 వద్ద కొనసాగుతుంది.
దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలను పరిశీలిస్తే..
♦ ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,250 కాగా.. 24 క్యారట్ల ధర రూ.89,710.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 82,100 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.89,560 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో వెండి ధరలో ఇవాళ స్వల్పంగా తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,11,900గా నమోదైంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,02,900.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,11,900గా నమోదైంది.
