Gold Rate: తగ్గిన ధర.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర ..
- Harishth Thanniru
- Published On : December 18, 2024 / 11:22 AM IST
gold
Gold And Silver Price: దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 160తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ వంటి ప్రధాన నగరాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,350కు చేరగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.77,840 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,500 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 77,990.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.71,350 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.77,840.
చెన్నైలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 71,350 కాగా.. 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ. 77,840 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా ..
దేశవ్యాప్తంగా బుధవారం వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.1,00,000 కు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,00,000.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండి ధర రూ. 92,500.
బెంగళూరులో కిలో వెండి ధర రూ. 92,500 వద్ద కొనసాగుతుంది.
పైనపేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం నమోదైనవి. ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
