Gold Rate Today: బంగారం కొనేవాళ్లకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, విజయవాడలో ఇవాళ గోల్డ్ రేటు ఎంత తగ్గిందంటే..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం తగ్గింది.
- Harishth Thanniru
- Published On : March 21, 2025 / 10:14 AM IST
Gold Rate
Gold And Silver Price Today: బంగారం కొనుగోలు చేస్తున్నారా.. అయితే, మీకు శుభవార్త. గత కొద్దిరోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. శుక్రవారం బంగారం, వెండి ధరలు తగ్గాయి.
ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ పై రూ.440 తగ్గింది. అదేవిధంగా కిలో వెండిపై రూ. 2,100 తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు.. దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లోని బంగారం, వెండి ధరలను తెలుసుకుందాం..
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.82,700 కాగా.. 24 క్యారట్ల ధర రూ.90,220 వద్ద కొనసాగుతుంది.
దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలను పరిశీలిస్తే..
♦ ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 83,850 కాగా.. 24 క్యారట్ల ధర రూ.90,370.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 82,700 కాగా.. 24క్యారెట్ల ధర రూ.90,220 వద్దకు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,12,000గా నమోదైంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,03,000.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,12,000గా నమోదైంది.
