Gold Rate Today: హమ్మయ్య.. చాన్నాళ్లకు భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. హైదరాబాద్, విజయవాడలో తులం బంగారం ధర ఎంతో తెలుసా..?
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర..
- Harishth Thanniru
- Published On : March 22, 2025 / 10:54 AM IST
Gold
Gold And Silver Price Today: బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నవారికి శుభవార్త. గోల్డ్ రేటు భారీగా తగ్గింది. అంతర్జాతీయంగా చోట చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో కొద్దిరోజులుగా బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకెళ్తుంది. అయితే, శుక్రవారం తగ్గిన గోల్డ్ రేటు.. ఇవాళ కూడా భారీగా తగ్గింది.
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 24క్యారట్ల 10గ్రాముల బంగారంపై రూ. 440 తగ్గింది. 22క్యారట్లపై రూ.400 తగ్గింది. దీంతో రెండు రోజుల్లో 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ పై రూ. 880 తగ్గింది. మరోవైపు వెండి ధర సైతం భారీగా తగ్గింది. ఇవాళ కిలో వెండిపై రూ.2వేలు తగ్గింది. దీంతో నిన్న, ఇవాళ కిలో వెండిపై రూ. 4,100 తగ్గుదల చోటు చేసుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లలో చూసుకుంటే.. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు (31.10గ్రాములు) 3,022 డాలర్ల వద్ద కొనసాగుతుంది. శుక్రవారంతో పోలిస్తే ఓన్స్ గోల్డ్ పై 13.79 డాలర్లు తగ్గింది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు ఓన్సుకు 33 డాలర్ల పైన ట్రేడింగ్ అవుతోంది. ఇదిలాఉంటే.. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం వంటి ప్రధాన నగరాలతో పాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలను తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.82,300 కాగా.. 24 క్యారట్ల ధర రూ.89,780 వద్ద కొనసాగుతుంది.
దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలను పరిశీలిస్తే..
♦ ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,450 కాగా.. 24 క్యారట్ల ధర రూ.89,980.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 82,300 కాగా.. 24క్యారెట్ల ధర రూ.89,780 వద్దకు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,10,000 కి తగ్గింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,01,000.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,10,000గా నమోదైంది.
