Gold Rate: తగ్గుతున్న గోల్డ్ రేటు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర ..
- Harishth Thanniru
- Published On : March 23, 2025 / 08:22 AM IST
Gold
Gold And Silver Price: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అలర్ట్. గత రెండు రోజులుగా బంగారం ధర తగ్గింది. అయితే ఇవాళ మాత్రం స్థిరంగా ట్రేడవుతున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా గోల్డ్ రేట్లు ఇప్పుడు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.
అంతర్జాతీయ మార్కెట్లలో చూసుకుంటే.. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు (31.10గ్రాములు) 3,022 డాలర్ల వద్ద కొనసాగుతుంది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు ఓన్సుకు 33 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది.
గత కొంతకాలంగా అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలకు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మళ్లీ యూఎస్ డాలర్ పుంజుకోవడంతో గత మూడు రోజులుగా గోల్డ్ రేట్లు దిగొస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.82,300 కాగా.. 24 క్యారట్ల ధర రూ.89,780 వద్ద కొనసాగుతుంది.
దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలను పరిశీలిస్తే..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,450 కాగా.. 24 క్యారట్ల ధర రూ.89,980 వద్ద కొనసాగుతుంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 82,300 కాగా.. 24క్యారెట్ల ధర రూ.89,780 వద్దకు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,10,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,01,000.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,10,000గా నమోదైంది.
