Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేటు ఎంతుందో తెలుసా? నేటి పసిడి ధరలు ఇలా..
దేశంలో వెండి ధరల్లో రూ.100 పెరుగుదల కనపడింది. వివిధ నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
- T Venkateshwarlu
- Published On : February 25, 2025 / 07:26 AM IST
దేశంలో ఇవాళ పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇవాళ ఉదయం 7 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. దేశంలో బంగారం ధరల్లో రూ.10 పెరుగుదల కనపడింది. అలాగే, వెండి ధరల్లో రూ.100 పెరుగుదల కనపడింది. మరోవైపు, అంతర్జాతీయంగానూ పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పసిడిలో పెట్టుబడులకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పసిడి ధరలు తులానికి 80 వేల రూపాయలకు మించి ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 7 గంటల సమయానికి 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.80,560గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,880గా ఉంది.
ఢిల్లీ, ముంబైలో..
- ఢిల్లీలో బంగారం ధర రూ.10 పెరిగి, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.80,700గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.88,030గా ఉంది
- ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.80,560గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,880గా ఉంది
వెండి ధరలు
దేశంలో వెండి ధరల్లో రూ.100 పెరుగుదల కనపడింది. వివిధ నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
- హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,08,100గా ఉంది
- విజయవాడలో కిలో వెండి ధర రూ.1,08,100గా ఉంది
- విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.1,08,100గా ఉంది
- ఢిల్లీలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.1,01,100గా ఉంది
- ముంబైలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.1,01,100గా ఉంది
