Gold Rate: గోల్డ్ కొంటున్నారా? మీకు గుడ్‌న్యూస్.. వరుసగా మూడోరోజు భారీగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో తులంపై ఎంత తగ్గిందంటే..?
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర భారీగా తగ్గింది.
- Harishth Thanniru
- Published On : July 26, 2025 / 11:17 AM IST
Gold
Gold Rate: బంగారం ధరలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు పసిడి మీద పెట్టుబడులను తగ్గిస్తున్నారు. ఇన్వెస్టర్లు ఇతర అంశాల వైపు చూస్తున్నారు. దీంతో బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.550 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 500 తగ్గింది. దీంతో గడిచిన మూడు రోజుల్లో (గురు, శుక్ర, శనివారం) 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ పై సుమారు రూ.2,400 తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 33 డాలర్లు తగ్గింది. ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 3,336 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
వెండి ధరసైతం భారీగా తగ్గింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ. 2వేలు తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.91,600కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ.99,930కి చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,750కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ. 1,00,080కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.91,600 కాగా.. 24క్యారెట్ల ధర రూ.99,930కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,26,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,16,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,26,00 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
