Site icon 10TV Telugu

Gold Rates: అయ్యబాబోయ్.. ఇక ఏం కొంటాం.. బెంబేలెత్తిస్తున్న గోల్డ్ రేటు.. తాజాగా ఎంత పెరిగిందంటే..?

Gold Price

Gold Price

Gold Rates: బంగారం ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తున్నాయి. ఇటీవల గోల్డ్ రేటు వరుసగా తగ్గుతూ వచ్చింది. గత వారం రోజుల నుంచి మళ్లీ బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి.

అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో గోల్డ్ రేటు పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రభావంతోనూ బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. పండుగ సీజన్ వచ్చేసింది.. వ్రతాలు, నోములు, పెండ్లిళ్లు ఇలా అనేక శుభకార్యాలు జరగుతున్నాయి. దీంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. దీంతో ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా.. గోల్డ్ రేటు మళ్లీ పెరిగింది.

మంగళవారం గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 820 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 750 పెరిగింది. అయితే, గడిచిన నాలుగు రోజుల్లో తులం బంగారంపై సుమారు రూ.2800 పెరిగింది. మరోవైపు వెండి ధరసైతం భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.2వేలు పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.93,700 చేరగా.. 24 క్యారట్ల ధర రూ.1,02,220కి చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,850కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ. 1,02,370కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.93,700 కాగా.. 24క్యారెట్ల ధర రూ.రూ.1,02,220కు చేరింది.

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర రూ.2వేలు పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,25,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,15,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,25,00 వద్ద కొనసాగుతుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

Exit mobile version