Gold Rate: మళ్లీ దూకుడు పెంచిన బంగారం.. హైదరాబాద్, విజయవాడలో ఇవాళ్టి గోల్డ్ రేటు ఎంతో తెలుసా.. 24 క్యారట్ల..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర ..
- Harishth Thanniru
- Published On : March 5, 2025 / 10:29 AM IST
Gold
Gold And Silver Price: బంగారం కొనుగోలుదారులకు బిగ్ షాకింగ్ న్యూస్. వరుసగా రెండోరోజు బంగారం ధర భారీగా పెరిగింది. మంగళవారం 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ పై రూ. 760 పెరగ్గా.. ఇవాళ (బుధవారం) రూ. 600 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు ఒక్కసారిగా రూ.90వేల చేరువకు దూసుకెళ్లింది.
ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 600 పెరగ్గా.. 22 క్యారట్ల గోల్డ్ పై రూ. 550 పెరిగింది. మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పు చోలు చేసుకోలేదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం వంటి ప్రధాన నగరాలతోపాటు.. దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎంతో తెలుసుకుందాం..
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.80,650 కాగా.. 24 క్యారట్ల ధర రూ.87,980.
దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలను పరిశీలిస్తే..
♦ ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,800 కాగా.. 24 క్యారట్ల ధర రూ.88,130గా నమోదైంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 80,650 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.87,980 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,07,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండిపై రూ.3వేలు తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.98,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,07,000గా నమోదైంది.
