Gold Rate: గోల్డ్ కొనుగోలు చేస్తున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు..
- Harishth Thanniru
- Published On : May 5, 2025 / 11:52 AM IST
Gold Rate
Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ షురూ అయింది. ఈ నేపథ్యంలో గోల్డ్ రేటు కాస్త తగ్గుముఖం పట్టడంతో మహిళలకు పెద్ద ఊరట లభించినట్లయింది. గత పదిరోజుల క్రితం వరకు గోల్డ్ రేటు సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఇటీవల కాలంలో బంగారం ధర తగ్గుముఖం పట్టింది. అయితే, ఇవాళ మళ్లీ గోల్డ్ రేటు పెరిగింది.
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ పై రూ. 220 పెరగ్గా, 22 క్యారట్ల బంగారంపై రూ. 200 పెరిగింది. మరోవైపు వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. వెయ్యి తగ్గింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఓసారి తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.87,750 కాగా.. 24 క్యారట్ల ధర రూ.95,730 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,900 కాగా.. 24 క్యారట్ల ధర రూ.95,880కు చేరుకుంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 87,750 కాగా.. 24క్యారెట్ల ధర రూ.95,730కు చేరుకుంది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,08,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.97,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,08,000 వద్దకు చేరింది.
Note: పైన పేర్కొన్న ధరలు ఉదయం 10గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరలు రోజులో పలు దఫాలుగా మారుతుంటాయి. ఖచ్చితమైన ధరల కోసం నగల దుకాణంలో లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి.
