Gold Rate: బంగారం కొంటున్నారా.. మీకు శుభవార్త.. మళ్లీ తగ్గిన గోల్డ్ రేటు.. హైదరాబాద్, విజయవాడలో ఇవాళ్టి ధరలు ఇలా..
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే, మీకు శుభవార్త. వరుసగా రెండోరోజు బంగారం ధర..
- Harishth Thanniru
- Published On : March 7, 2025 / 10:07 AM IST
Gold
Gold and Silver Prices Today: బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే, మీకు శుభవార్త. వరుసగా రెండోరోజు బంగారం ధర తగ్గింది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బంగారం ధర క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
అంతర్జాతీయ మార్కెట్ లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2,905 డాలర్ల వద్ద నమోదైంది. భారతదేశంలో శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ పై రూ. 330 తగ్గింది. దీంతో రెండు రోజుల్లో 24క్యారట్ల గోల్డ్ పై రూ. 820 తగ్గింది. మరోవైపు వెండి ధర స్వల్పంగా పెరిగింది. అయితే, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలను ఓసారి పరిశీలిద్దాం..
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.79,900 కాగా.. 24 క్యారట్ల ధర రూ.87,160.
దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలను పరిశీలిస్తే..
♦ ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,050 కాగా.. 24 క్యారట్ల ధర రూ.87,310గా నమోదైంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 79,900 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.87,160 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,08,100 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.99,100 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,08,100గా నమోదైంది.
