Gold Rate: బంగారం కొనాలా.. హైదరాబాద్, విజయవాడలో ఇవాళ్టి గోల్డ్ రేటు ఎంతో తెలుసా.. 24 క్యారట్ల 10గ్రాముల..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర..
- Harishth Thanniru
- Published On : March 9, 2025 / 09:30 AM IST
Gold
Gold Rate: భారతీయులకు బంగారంపై మక్కువ ఎక్కువ. శుభకార్యాలు, పండుగలు, ఇతర పర్వదినాల్లో బంగారం కొనుగోళ్లపై మక్కువ చూపుతుంటారు. గత కొన్నిరోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే, ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.
అంతర్జాతీయ మార్కెట్ లోనూ బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం ఔన్స్ గోల్డ్ 2,911 డాలర్ల వద్ద కొనసాగుతుంది. ఔన్స్ సిల్వర్ రేటు 32.55 డాలర్లుగా ఉంది. అయితే, వచ్చేవారం బంగారం ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు మినహా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చునని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దేశంలో ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ.87,710 వద్ద కొనసాగుతుంది. 22 క్యారట్ల బంగారం ధర రూ.80.400 వద్ద కొనసాగుతుంది. అయితే, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలను ఓసారి పరిశీలిద్దాం..
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.80,400 కాగా.. 24 క్యారట్ల ధర రూ.87,710.
దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలను పరిశీలిస్తే..
♦ ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,550 కాగా.. 24 క్యారట్ల ధర రూ.87,860.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 80,400 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.87,710 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో వెండి ధరలో ఇవాళ ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,08,100 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.99,100 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,08,100గా నమోదైంది.
