Gold Price Today : నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఎంతో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో సోమవారం బంగారం ధర పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో ..

Gold And Silver Price Today

Gold And Silver Price Today : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ సెబీ చైర్ పర్సన్ పై హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణల ప్రభావం సూచీలపై పడింది. స్టాక్ మార్కెట్ల సూచీలు నష్టాల్లో కొనసాగుతున్న వేళ బంగారం ధరలు మరోసారి పెరిగాయి. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 270 పెరిగింది. మరోవైపు వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ. 100 తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలను ఓసారి పరిశీలిద్దాం.

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో సోమవారం బంగారం ధర పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,700 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.70,580.
  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.64,850 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 70,730.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.64,700 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 70,580.
    చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,700 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70,580 వద్ద కొనసాగుతుంది.

  • వెండి ధర ఇలా ..
    దేశ వ్యాప్తంగా సోమవారం వెండి ధర స్వల్పంగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
    తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 88,000.
    దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
    చెన్నైలో కిలో వెండిపై రూ. 600 తగ్గింది. దీంతో అక్కడ ప్రస్తుతం కిలో వెండి ధర రూ.87,500.
    కోల్ కతా,ఢిల్లీ, ముంబయిలో కిలో వెండి ధర రూ. 5,600 తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి రూ. 82,500 వద్ద కొనసాగుతుంది.
    బెంగళూరులో కిలో వెండి ధర రూ. 9,100 తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి రేటు రూ. 79,000 వద్ద కొనసాగుతుంది.
  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.

 

 

ట్రెండింగ్ వార్తలు