Gold Price Today : బంగారం ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరల్లో కీలక మార్పు
తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ..
- Harishth Thanniru
- Published on- July 12, 2024 / 10:11 AM IST
Gold
Gold And Silver Price Today : బంగారం కొనుగోలుదారులకు ధరలు బిగ్ షాక్ ఇస్తున్నాయి. గోల్డ్ రేటు తగ్గినట్లేతగ్గి మళ్లీ రెండు రోజులుగా పెరుగుతూ వస్తోంది. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.330 పెరిగింది. దీంతో రెండు రోజుల్లో రూ. 550 పెరిగినట్లయింది. మరోవైపు కిలో వెండి ధర రూ. లక్షకు చేరుకుంది. వెండి ధర మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా ఇవాళ్టి బంగారం, వెండి ధరలను ఓ సారి పరిశీలిస్తే..
- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,600కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.73,750. - దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.67,750 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 73,900.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.67,600 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 73,750.
చెన్నైలో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.68,250 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 74,460కు చేరింది.
- వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా శుక్రవారం వెండి ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 1,00,000.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ.1,00,000.
కోల్ కతాలో కిలో వెండి ధర రూ. 95,500 వద్ద కొనసాగుతుంది.
ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.95,500.
బెంగళూరులో కిలో వెండి ధర రూ. 95,000 వద్ద కొనసాగుతుంది.
- పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
