Gold Price : మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం గోల్డ్ రేటు ఎంతో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం బంగారం ధర భారీగా తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర..
- Harishth Thanniru
- Published On : November 13, 2024 / 10:35 AM IST
Gold And Silver Price
Gold And Silver Price: గత వారం రోజులుగా బంగారం, వెండి కొనుగోలుదారులకు భారీ ఊరట లభిస్తోంది. గత నెలలో రికార్డు స్థాయిలో నమోదైన బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో బంగారం, వెండి కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.440 తగ్గగా.. కిలో వెండిపై రూ. వెయ్యి తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి పరిశీలిద్దాం..
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం బంగారం ధర భారీగా తగ్గింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,450కు చేరింది. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.76,850 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,600 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 76,000.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.70,450 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 76,850.
చెన్నైలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 70,450 కాగా.. 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ. 76,850 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా ..
బుధవారం వెండి ధర భారీగా తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.1,01,000.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,01,000.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండి రేటు రూ. 91,000.
బెంగళూరులో కిలో వెండి ధర 91,000 వద్ద కొనసాగుతుంది.
పైనపేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం నమోదైనవి. ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
