Gold and silver Price: యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం ఎఫెక్ట్.. ఒక్కరోజులోనే బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర ..
- Harishth Thanniru
- Published On : September 20, 2024 / 12:11 PM IST
Gold
Gold Price Today : అమెరికా ఫెడరల్ రిజర్వ్ నాలుగేళ్ల తరువాత గురువారం తొలిసారి వడ్డీ రేట్లను తగ్గించింది. ఈ ప్రభావంతో భారతదేశంలోని బంగారం, వెండి ధరలపై పడింది. అమెరికా వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లు తగ్గినప్పుడు అక్కడ ఉన్న డిపాజిట్లను పెట్టుబడులకు సురక్షితంగా భావించే బంగారం వైపు మళ్లించడం జరుగుతుంటుంది. ఈ క్రమంలో.. బంగారం ధర కొత్త గరిష్టాలకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా.. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 660 పెరగ్గా.. కిలో వెండిపై రూ. 1500 పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,850 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.75,110.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,000 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 75,260.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.68,850 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.75,110.
చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,850 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.75,110 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా శుక్రవారం వెండి ధర భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.97,500 కు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ. 97,500.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండి రూ. 92,500 వద్ద కొనసాగుతుంది.
బెంగళూరులో వెండి ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. దీంతో అక్కడ కిలో వెండి ధర 85,000కు చేరింది.
పైనపేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
