Gold and silver Price: దడ పుట్టిస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేటు ఎంతంటే?
బంగారం, వెండి కొనుగోలు చేయాలన్న ఆలోచన వస్తేనే వాటి ధరలు దడపుట్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా బంగారం ధర కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. గత వారం రోజులుగా ..
- Harishth Thanniru
- Published On : October 23, 2024 / 11:36 AM IST
Gold
Gold And Silver Price Today: బంగారం, వెండి కొనుగోలు చేయాలన్న ఆలోచన వస్తేనే వాటి ధరలు దడపుట్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా బంగారం ధర కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. గత వారం రోజులుగా వీటి ధరలు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం కూడా బంగారం ధర పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ పై రూ. 430 పెరిగింది. వెండి ధరసైతం పెరిగింది. కిలో వెండిపై రూ. 2వేలు పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ నమోదైన బంగారం, వెండి ధరలను ఓసారి పరిశీలిద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం బంగారం ధర భారీగా పెరిగింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,400కు చేరింది. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.80,070 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,550 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 80,220.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.73,400 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.80,070.
చెన్నైలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 73,400 కాగా.. 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ.80,070 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా ..
బుధవారం వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ.2వేలు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.1,12,000 వద్దకు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,12,000.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,04,000.
బెంగళూరులో కిలో వెండి ధర 99,000 వద్దకు చేరింది.
పైనపేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం నమోదైనవి. ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
