Gold Price Today : బంగారం ధరల్లో భారీ మార్పు.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలో గురువారం పెరుగుదల చోటు చేసుకుంది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..
- Harishth Thanniru
- Published On : October 26, 2023 / 07:23 AM IST
gold
Today Gold and Silver Rate : భారత్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ఖరీదైనవిగా మారుతున్నాయి. గత కొద్దిరోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. అటు పెళ్లిళ్ల సీజన్, ఇటు వరుస పండుగలు కావడంతో బంగారం కొనుగోలుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. అయితే, వారికి రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలు షాకిస్తున్నాయి. గురువారంసైతం బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 100 పెరగ్గా, 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 110 పెరిగింది. వెండి ధర మాత్రం తగ్గింది. వెండి ధర వరుసగా మూడోరోజు తగ్గింది. దీంతో మూడు రోజుల్లో కిలో వెండిపై రూ. 1200 తగ్గుదల చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో గురువారం బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈ రోజు బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో ఓసారి చూద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలో గురువారం పెరుగుదల చోటు చేసుకుంది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 56,650 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 61,800 కు చేరుకుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,800 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 61,950కు చేరింది.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 56,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 కు చేరింది.
– చెన్నైలో గోల్డ్ ధర తగ్గింది. 22 క్యారెట్ల బంగారంపై రూ. 200 తగ్గగా, 24 క్యారెట్ల బంగారంపై రూ. 220 తగ్గింది. దీంతో అక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 56,550 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,690 వద్దకు చేరింది.
మూడోరోజు తగ్గిన వెండి ధర ..
దేశ వ్యాప్తంగా మూడు రోజులుగా వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గురువారం కిలో వెండిపై రూ. 500 తగ్గింది. దీంతో మూడు రోజుల్లో కిలో వెండిపై రూ. 1200 తగ్గుదల చోటు చేసుకుంది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 77,500కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,500. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాలలో వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో ఆ ప్రాంతాల్లో కిలో వెండి రూ.74,600 వద్ద కొనసాగుతుంది. బెంగళూరులోకూడా ధరల్లో మార్పు చోటుచేసుకోలేదు. అక్కడ కిలో వెండి రూ.74,000 వద్ద కొనసాగుతుంది.
