Gold silver Rates : బంగారం, వెండి కొనేవాళ్లకు శుభవార్త.. నేటి ధరలు ఇవే..
Gold silver Rates : బంగారం, వెండి ధరలు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా.. అయితే, మీకు స్వల్ప ఊరట. ఎందుకంటే గత రెండు రోజులుగా
- Harishth Thanniru
- Published On : December 21, 2025 / 09:01 AM IST
Gold silver Rates
Gold silver Rates : బంగారం, వెండి ధరలు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా.. అయితే, మీకు స్వల్ప ఊరట. ఎందుకంటే గత రెండు రోజులుగా బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ఇవాళ వెండి ధరల్లోనూ ఎలాంటి మార్పులు చోటే చేసుకోలేదు.
Also Read : Gold Silver Rates : బంగారం, వెండి.. భవిష్యత్తులో ఏది అత్యుత్తమం.. నిపుణులు ఏం చెప్పారంటే? నేటి ధరలు ఇవే..
ఇదిలాఉంటే.. వచ్చే ఏడాది ప్రారంభంలో గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బంగారం మార్కెట్లో చారిత్రాత్మక ఏడాదిగా 2025 సంవత్సరం నిలిచింది. ఏడాది ప్రారంభంలో 10గ్రాముల బంగారం ధర సుమారు రూ.80వేల స్థాయిలో ఉండగా.. ప్రస్తుతం రూ.1.30 లక్షలకు చేరింది. అదేవిధంగా వెండి ధరసైతం భారీగా పెరుగుతూ వచ్చింది.
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం పరిస్థితుల ప్రకారం.. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లోనూ బంగారం, వెండి రేటు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,23,600 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,34,840కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,23,750 కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,34,990కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,23,600 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,34,840కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,26,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,14,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,26,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
