Site icon 10TV Telugu

Gold Price : తగ్గేదేలే.. వారం రోజుల్లో తులం బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా..? వామ్మో.. సరికొత్త రికార్డులు నమోదు

Gold Price

Gold Price

Gold Price : బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకెళ్తుంది. తద్వారా సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ తోపాటు.. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు కారణంగా గోల్డ్ రేటు పరుగులు పెడుతోంది.

సోమవారం బంగారం ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ. 930 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.850 పెరిగింది. దీంతో గడిచిన వారం రోజుల్లో (ఆగస్టు 26వ తేదీ నుంచి) 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై సుమారు రూ. 4,500 పెరిగింది.

మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్సు గోల్డ్ 39 డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 3,486 డాలర్ల వద్ద కొనసాగుతుంది. వెండిసైతం పెరిగింది. భారతదేశంలో కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఓసారి పరిశీలిస్తే..

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.97,050 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,05,880 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,200 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,06,030 వద్దకు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.97,050 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,05,880కు చేరింది.

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,36,000కు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,26,000కు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,36,000కు చేరింది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

 

Exit mobile version