Gold: బంగారం ధరలు ఇకపై ఎలా ఉండనున్నాయో తెలుసా?

Gold: అంతర్జాతీయంగా బంగారం ధరలు 2025 నాటికి ఔన్సుకు రూ.2,48,740 ($3,000)కు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఆసియా ట్రేడ్‌లో ఇవాళ పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఫెడరల్ రిజర్వ్ అధికారులు తాజాగా నిర్వహించిన సమావేశంలో అధికారులు మాట్లాడుతూ.. వడ్డీ రేట్లను తగ్గించడానికి తామేం తొందరపడటం లేదన్నారు. అలాగే, ద్రవ్యోల్బణంపై కూడా ఆశావాద దృక్పథంలో ఉన్నామని చెప్పారు.

ఈ మేరకు యూఎస్ ఫెడ్ మినట్స్ విడుదల చేశారు. మరోవైపు, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల మందగమనం, జపాన్, యూకే మాంద్యం భయంతో పసిడి ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. బంగారం ధరల్లో భారీ మార్పులు ఏవీ చోటుచేసుకోలేదు. డాలర్ విలువలో ఒడిదుడుకులు కూడా దీనికి కారణమయ్యాయి.

నెల రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్సుకు రూ.1,65,837 నుంచి 1,69,966 ($2,000 to $2,050) మధ్య కొనసాగుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.62,155 వద్ద ప్రారంభమై ఇంట్రాడే రూ.62,169 గరిష్ఠస్థాయిని తాకింది.

అలాగే, అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్ కు రూ.1,67,898 ($2,025) వద్ద ట్రేడవుతోంది. వడ్డీ రేట్లు తగ్గితే బంగారం పెట్టుబడుదారులకు లాభాలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. 2025 నాటికి బంగారం ధరలు ఔన్సుకు రూ.2,48,740 ($3,000)కు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేశారు.

Gold: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎంత పెరిగాయో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు