Gold Price Today : వామ్మో.. రికార్డుల మోత మోగిస్తున్న బంగారం, వెండి ధరలు.. ఇవాళ ఒక్కరోజే వెండిపై 9వేలు.. బంగారంపై 3వేలు.. రూ. 2లక్షలు దాటేసింది..
Gold Price Today : బంగారం, వెండి ధరలు రికార్డుల మోత మోగిస్తున్నాయి. గతంలో ఎప్పుడూలేని స్థాయిలో ఆల్ టైం గరిష్ఠ ధరలను నమోదు చేస్తున్నాయి.
- Harishth Thanniru
- Published On : October 14, 2025 / 10:56 AM IST
Gold price Today
Gold Price Today : బంగారం, వెండి ధరలు రికార్డుల మోత మోగిస్తున్నాయి. గతంలో ఎప్పుడూలేని స్థాయిలో ఆల్ టైం గరిష్ఠ ధరలను నమోదు చేస్తున్నాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు ఎప్పుడూలేని విధంగా ఒక్కరోజులోనే భారీగా పెరిగాయి.
మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 3,280 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ.3000 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 60డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 4,174 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
మరోవైపు వెండి ధర ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. ఇవాళ కిలో వెండిపై ఏకంగా రూ. 9వేలు పెరిగింది. తద్వారా కిలో వెండి ధర రూ.2లక్షలు దాటుకొని సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,17,950 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,28,680కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,100 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,28,830కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,17,950 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,28,680కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది.. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,06,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో మాత్రం కిలో వెండి ధర రూ.4వేలు పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి రేటు రూ.1,89,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,06,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
